- Home
- Entertainment
- Singer Sunitha: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత! స్వయంగా చెప్పడంతో!
Singer Sunitha: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత! స్వయంగా చెప్పడంతో!
సింగర్ సునీత తల్లి అయ్యారంటూ కొన్ని రోజులుగా ప్రచారం అవుతుంది. ఈ కథనాలపై సునీత స్వయంగా క్లారిటీ ఇచ్చారు..

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత 2021 జనవరిలో రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. సునీత నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఒకింత విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సింగర్ సునీత వివరణ ఇచ్చారు. పిల్లలు, నా భవిష్యత్ కోసం కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత ఏడడుగులు వేశారు. సునీత -రామ్ ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రామ్ తో సునీత దాంపత్యం జీవితం ఆనందంగా సాగుతుంది. అందుకు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం. సునీత వివాహం చేసుకుని రెండేళ్లు అవుతుంది. ఇటీవల సునీత గర్భం దాల్చారన్న ప్రచారం జోరందుకుంది. దీనిపై వరుస కథనాలు వెలువడ్డాయి. సునీత ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించలేదు. దీంతో సునీత తల్లయ్యారన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది.
ఎట్టకేలకు సునీత స్పష్టత ఇచ్చారు. త్వరలో ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. దీని సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సునీతను మీడియా ప్రతినిధులు 'మీరు తల్లి అయ్యారనే పుకార్లు వినిపిస్తున్నాయి? ఏమంటారు?' అని అడిగారు. ఈ ప్రశ్నకు సునీత కొంచెం కరుకైన సమాధానం చెప్పాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఈ పుకార్లు పుట్టిస్తున్నవారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నాను. వారు నన్ను, నా జీవితాన్ని ఏమీ చేయలేరని సమాధానం చెప్పారు.
పరోక్షంగా ప్రెగ్నెన్సీ రూమర్స్ ని ఖండించారు. సింగర్ సునీత 1997లో కిరణ్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. 2017లో అధికారికంగా విడిపోయారు. రెండో వివాహంగా రామ్ వీరపనేని ని చేసుకున్నారు. కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే అతని డెబ్యూ మూవీ లాంచ్ చేశారు. కూతురు శ్రేయా ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్నారు.
17ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టిన సునీత స్టార్ సింగర్ హోదా తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాలకు పనిచేశారు. సింగర్ బాలుతో కలిసి పాడుతాతీయగా వంటి టాప్ మ్యూజిక్ షోలలో భాగమయ్యారు.