- Home
- Entertainment
- లైగర్ రిజల్ట్ పై ఛార్మి ఎమోషనల్.... మూడేళ్లు ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే, చివరకు ఇలా అయ్యింది
లైగర్ రిజల్ట్ పై ఛార్మి ఎమోషనల్.... మూడేళ్లు ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే, చివరకు ఇలా అయ్యింది
లైగర్ మూవీ రిజల్ట్ పై ఫైనల్ గా ఛార్మి ఓపెన్ అయ్యారు. ఒక విధంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి మూడేళ్లకు సినిమా విడుదల చేస్తే ఫలితం దెబ్బతీసింది అన్నారు.

లైగర్ ఫెయిల్యూర్ గురించి ఆమె మాట్లాడుతూ... ఒక్క క్లిక్ తో ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే అవకాశం కలిగి ఉన్నారు. ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భారీ చిత్రాలు చూడవచ్చు. కాబట్టి డిజిటల్ చిత్రాలు వాళ్ళను నిరాశపరిస్తే మినహా థియేటర్స్ కి వచ్చే పరిస్థితి లేదు.
ఇటీవల విడుదలైన తెలుగు చిత్రాలు బింబిసార, సీతారామం, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేశాయి. మొత్తంగా రూ. 150 నుండి 170 కోట్ల వసూళ్లను రాబట్టగలిగాయి. కానీ బాలీవుడ్ లో పరిస్థితులు అసలేం బాగోలేదు. అక్కడ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు. 2019లో కరణ్ జోహార్ ని కలిశాము. 2020 జనవరిలో లైగర్ ఫస్ట్ షెడ్యూల్ చేశాము.
కరోనా కారణం మూడేళ్లు ఆలస్యమైంది. ఎన్నో ఇబ్బందులు పడి సినిమాను ప్రేక్షకుల ముందు తెచ్చాము. సినిమా ఫెయిల్యూర్ కావడం బాధగా ఉందని ఛార్మి భావోద్వేగానికి గురయ్యారు. విడుదలకు ముందే ఛార్మి ఈ ప్రస్తావన తేవడం విశేషం. దాదాపు రూ. 200 కోట్ల ఓటీటీ డీల్ సినిమాపై నమ్మకంతో వదిలేసినట్లు గతంలో చెప్పారు.
Liger Movie
నిజంగా అలా ఓటీటీకి ఇచ్చినా లైగర్ నిర్మాతలకు లాభాలు దక్కేవి. తెలుగుతో పాటు ఓవర్సీస్ లో లైగర్ పూర్తిగా చతికిలపడింది. ఫస్ట్ డే పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం సెకండ్ డే కూలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 40 కోట్ల వరకు నష్టాలు మిగిల్చే ఛాన్స్ ఉంది.
Liger Movie
గుడ్డిలో మెల్ల అన్నట్లు హిందీలో పర్లేదు. వీకెండ్ ముగిసే నాటికి రూ. 13.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. 6.25 కోట్ల షేర్ అందుకుంది. రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన లైగర్ హిందీ వర్షన్ బ్రేక్ ఈవెన్ కావడం ఈజీ. అలాగే ట్రెండ్ కంటిన్యూ అయితే లాభాలతో ముగియవచ్చు. ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా లైగర్ మూవీ హిందీలో రికార్డు వసూళ్లు రాబట్టేది.