సమంత- చైతు విడాకులు: నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్ ఇదే!
కొన్నాళ్లుగా అక్కినేని కుటుంబంలో నెలకొన్న సందిగ్దత ఏమిటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. మీడియా సంస్థలు ఇక క్లారిటీకి రావడంతో పాటు, చైతు, సమంత విడాకులు తీసుకోవడం ఖాయమే అని చెబుతున్నాయి.

ఇక సమంత తీసుకునే భరణం, విడాకుల తరువాత ఆమె మకాం.. ఇలా అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కథనాలపై సమంతతో పాటు నాగ చైతన్య సైతం స్పందించలేదు.
తాజా ఇంటర్వ్యూలో పరోక్షంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగ చైతన్య. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగ చైతన్య రూమర్స్ పై పెదవి విప్పారు. ప్రచారం అవుతున్న కథనాలపై మీ స్పందన ఏంటని అడుగగా... చైతూ ఆసక్తికర సమాధానం చెప్పారు.
కథనాలు కొంచెం బాధాకరమే, కానీ ఈ వార్తలు జనాల మదిలో ఎక్కువ కాలం ఉండవు. నిజాలు మాత్రమే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. టీఆర్పీల కోసం రాసే వార్తలు నిలబడవు. ఈ రోజుల్లో ఒక న్యూస్ ని మరో న్యూస్ రీప్లేస్ చేస్తుంది.
మీడియా కథనాలపై ఎలా స్పందించాలో నేను పూర్తి గా నేర్చుకున్నాను. అప్పటి నుండి నిరాధార కథనాలు నన్ను బాధపెట్టడం లేదు. రూమర్స్ ని నేను పట్టించుకోను అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ ని , పర్సనల్ లైఫ్ ని నేను సపరేట్ గా చూస్తాను. ఆ రెండింటిని మిక్స్ చేయను అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
నాగ చైతన్య సమంతతో విడాకుల వార్తలపై ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఇక నేడు లవ్ స్టోరీ చిత్రం విడుదల కావడం జరిగింది. యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా చిత్రంపై మిక్స్డ్ టాక్ వినపడుతుంది.