ఇక రష్మీకి ఎప్పుడూ అదే పనా మారదా... జనాలు విసిగిపోయారు బాబోయ్!
ఒకసారి చేస్తే థ్రిల్ పదే పదే అదే చేస్తే ఎగతాళి అవుతుంది. ఇడుగో ప్రియుడు, అదిగో పెళ్లి అంటూ రష్మీ ప్రోమోల కోసం చెప్పే కహానీలతో జనాలు విసిగిపోయారు.
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సాధారణ జనాలకు ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి, ప్రేమ వంటి వ్యవహారాలు మంచి కిక్ ఇస్తాయి. అందుకే గాసిప్స్ కి భలే డిమాండ్ ఉంటుంది. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పై ఈ తరహా వార్తలు తరచుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి.
Sudigali Sudheer
రెండు మూడు నెలలకోసారి రష్మీ వివాహం చేసుకుంటున్నారని, ఆమె ప్రియుడు ఈయనే అంటూ వార్తలు వస్తుంటాయి. మీడియా ఇంటరాక్షన్స్ లో రష్మీ ఈ వార్తలను ఖండిస్తూ ఉంటారు. ఇది నిత్యకృత్యం. అదే సమయంలో ఆమె ఈ తరహా గాసిప్స్ ద్వారా జనాల నోళ్ళలో నానాలి అనుకుంటుందేమో కానీ... అస్పష్టంగా కొన్ని కామెంట్స్ చేస్తుంది.
ఇక ఆమె యాంకర్ గా ఉన్న బుల్లితెర షోలలో దారుణమైన ప్రోమోలు కట్ చేస్తారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు టీఆర్పీ తేవడం కోసం రష్మీని బాగా వాడేస్తున్నారు. పలుమార్లు ఈ రెండు షోలలో రష్మీ తన పెళ్లి గురించి చెప్పబోతున్నట్లు, ప్రియుడి పేరు వెల్లడిస్తున్నట్లు ప్రోమోలు కట్ చేసి వదిలారు.
మొదట్లో ఈ ఫార్ములా బాగా వర్క్ అవుట్ అయ్యింది. రష్మీ లవర్ ఎవరో తెలుసుకోవాలని సదరు ఎపిసోడ్ ఎగబడి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏదో కొత్త వార్త తెలుస్తుందని ఎపిసోడ్ చివరి వరకు వదలకుండా చూసిన ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే నిజానికి రష్మీ ఏం చెప్పాలని అనుకోవడం లేదు. అది ప్రోమో కోసం ఇచ్చిన హైప్ మాత్రమే.
Rashmi Gautam
పదిసార్లు మోసపోయినోడు పదకొండో సారి మోసపోడు కదా. అలాగే విసిగిపోయిన జనాలు మల్లెమాల సేమ్ ట్రిక్ ప్లే చేస్తుంటే తిట్టిపోస్తున్నారు. తాజాగా పెళ్లిపీటలపై రష్మీ కూర్చొని ఉంది. పక్కనే ఓ వ్యక్తి మల్లెదండలతో ముఖం కవర్ చేసుకొని వరుడు స్థానంలో కూర్చొని ఉన్నారు.
సదరు ఫోటో స్క్రీన్ పై వేసి రష్మీ ఆ స్థానంలోకి ఎవరు రాబోతున్నారో చెప్పాలని పంచ్ ప్రసాద్ అడిగారు. ఆమె సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతుండగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో కట్ చేశారు. అది చూసిన జనాలు రష్మీని తిట్టిపోస్తున్నారు. ఆపు మీ వేషాలంటూ ఇప్పటికి చాలా చూశామని మండిపడుతున్నారు. టీఆర్పీ కోసం జనాల ఎమోషన్స్ తో ఆడుకుంటే రియాక్షన్ ఇలానే ఉంటుంది.