- Home
- Entertainment
- Ram Charan Birthday : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్.. చెర్రీ హృదయ పూర్వక కృతజ్ఞతలు..
Ram Charan Birthday : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్.. చెర్రీ హృదయ పూర్వక కృతజ్ఞతలు..
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎక్కడ చూసిన రామ్ చరణ్ (Ram Charan) మాట వినబడుతోంది. మరోవైపు చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ భారీ కటౌట్లు, సెలబ్రేషన్స్ తో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందుకు రామ్ చరణ్ వారందరికీ కృతజ్ఞలు తెలిపారు.

దర్శకధీరుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’(RRR). ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ అయి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు, కొమురం భీం గురించే మాట్లాడుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఎప్పుడూ తన నటనతో ఆకట్టుకోవడం, కొమురం భీం పాత్రలో మరింత ఆకట్టుకోవడం విశేషమైతే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో తన నటవిశ్వరూపాన్ని చూపించడంతో చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో తమ ఫేవరేట్ హీరో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే, మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున సెలబ్రేషన్ ను సిద్ధమయ్యారు. ఇప్పటికే భారీ కటౌట్లను రెడీ చేశారు. రామ్ చరణ్ ఇంటి వద్ద కూడా ఫ్యాన్స్ బారులు తీరారు. ట్వీట్ఱలో మాత్రం ప్రతి ఒక్కరు తమ అభిమాన హీరో రామ్ చరణ్ కు అడ్వాన్స్ గా బర్త్ డే విషేస్ తెలియజేస్తున్నారు.
రామ్ చరణ్ 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆర్సీ యువశక్తి (RcYuvaShakthi) రాష్ట్ర కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం 4:32 నిమిషాలకు శిల్పా కళావేదిక ఆడిటోరియంలో చాలా గ్రాండ్ గా చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
ఫ్యాన్ కూడా చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ముందుగానే పాస్ లు తీసుకున్నారు. శ్రేయాస్ మీడియా వారు ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కు అడ్వాన్స్డ్ గా బర్త్ డే విషెస్ తెలిపేందుకు ఫ్యాన్ ఇంటికి చేరుకున్నారు. ఇందుకు చరణ్ వారికి కనిపించి.. మెగా సెల్ఫీలు దిగి ఖుషీ చేశారు.
మరోవైపు యూస్ఏలోని లాస్ ఏంజెల్స్ లోనూ చెర్రీ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అక్కడ ఉన్న కొంతమంది లేడీ ఫ్యాన్స్ చెర్రీ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. మరో తెలుగు వీరాభిమాని వరి పంటలో రామ్ చరణ్ ముఖ చిత్రాన్ని దించి విషెస్ తెలిపారు.
ఇక థియేటర్ల వద్ద, కొన్ని ఫేమస్ జంక్షన్ల వద్ద రామ్ చరణ్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అయితే ఫ్యాన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ రావడంతో చరణ్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక నోట్ రిలీజ్ చేశాడు. ‘ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హ్రుదయపూర్వక కృతజ్ఞలు.. ఈ అపూర్వమైన పుట్టిన రోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను’ అని పేర్కొన్నాడు.