- Home
- Entertainment
- `జబర్దస్త్` వేదికగా వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మాన్యుయెల్.. అన్నంత పని చేసి షాకిచ్చిన కమెడియన్
`జబర్దస్త్` వేదికగా వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మాన్యుయెల్.. అన్నంత పని చేసి షాకిచ్చిన కమెడియన్
జబర్దస్త్ కమెడియన్స్ ఇమ్మాన్యుయెల్, వర్ష ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందరికి షాకిచ్చాడు ఇమ్మాన్యుయెల్. ప్రేమపై పంచాయతీ పెట్టి మరీ తాళి కట్టిన జబర్దస్త్ కమెడియన్. సెన్సేషనల్.

`జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి జంట చాలా పాపులర్. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇమ్మాన్యుయెల్, వర్ష జంట పాపులర్ అయ్యింది. వారిలాగానే వీరిద్దరు కూడా తమ ప్రేమని అందరి ముందు వ్యక్తం చేస్తూ ఆకట్టుకున్నారు. అంతేకాదు డ్యూయెట్లు పాడుకున్నారు. నవ్వంటే ఇష్టం అంటూ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు.
చాలా రోజులుగా ఈ ఇద్దరు కలిసి స్కిట్లు చేస్తున్నారు. కానీ ప్రేమ వ్యవహారం విషయంలో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఇన్నాళ్లకి బరస్ట్ అయ్యారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని బయటపెట్టుకున్నారు. తాజాగా ఇమ్మాన్యుయెల్ ప్రేమించి మోసం చేశాడని పంచాయితీ పెట్టించింది వర్ష. తమ తల్లిదండ్రులను తీసుకొచ్చి `బతుకు బస్టాండ్` అనే ప్రోగ్రామ్‌లో పంచాయితీ పెట్టించారు.
వర్షని ప్రేమించావా? లేదా అని ఇమ్మాన్యుయెల్‌ని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వైపుల ఘర్షణ చోటు చేసుకుంది. కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. వర్ష తల్లి తన కూతురుని ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ అందరి ముందు ఇమ్ముని కొట్టడానికి వెళ్లింది. పంచాయితీ మొత్తం రచ్చరచ్చ జరిగింది.
ఇక ఫైనల్‌గా తన ప్రేమని బయటపెట్టాడు ఇమ్మాన్యుయెల్. అంతేకాదు తనపై ఆమెకి ప్రేమ ఉందా లేదా అనేది అందరి ముందు చెప్పాలని, ఉందంటే ఇప్పటికిప్పుడే తాళి కట్టేస్తానని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అంతలోనే గెటప్ శ్రీను తాళిని పట్టుకుని స్టేజ్‌పై కి వచ్చాడు కాసేపు గోల చేశాడు. వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
వర్ష తన అభిప్రాయం చెప్పగానే రెచ్చిపోయాడు ఇమ్మాన్యుయెల్. అందరి ముందే ఇమ్మాన్యుయెల్ మెడలో తాళి కట్టాడు. దీంతో అంతా షాక్ ఇచ్చారు. జడ్జ్ లుగా ఉన్న పోసాని, కృష్ణభగవాన్‌లు, ఇంద్రజ ఇలా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇమ్మాన్యుయెల్ ఇంత పని చేశాడేంటి అంటూ ఆశ్చర్యపోయారు. కానీ వర్ష, ఇమ్మాన్యుయెల్, ఇతర కమెడీయన్లు సంబరాల్లో మునిగి తేలడం విశేషం. ఇది సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది.
ప్రస్తుతం విడుదలైన `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య ఉన్న రిలేషన్‌కి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. కానీ ఈ లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో మాత్రం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది.