- Home
- Entertainment
- వర్షని తల్లిని చేశాడంటూ ఇమ్మాన్యుయెల్ ఆవేదన.. అందరి ముందు తన గోడు చెప్పుకుంటూ జబర్దస్త్ కమెడియన్ కన్నీరు..
వర్షని తల్లిని చేశాడంటూ ఇమ్మాన్యుయెల్ ఆవేదన.. అందరి ముందు తన గోడు చెప్పుకుంటూ జబర్దస్త్ కమెడియన్ కన్నీరు..
జబర్దస్త్ కామెడీ షోలో పాపులర్ జోడీ అంటే వర్ష, ఇమ్మాన్యుయెల్ అనే చెప్పాలి. ఇప్పుడున్న వారిలో వీరే హైలైట్‌గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్షని తల్లిని చేశాడంటూ ఇమ్మాన్యుయెల్ ఆవేదన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ కామెడీ షోలో లవర్స్ గా చెలామణి అవుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. లవ్ ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్లు, ఏకంగా పెళ్లి వరకు వెళ్లారు. ఇక ఫస్ట్ నైటే మిగిలి ఉందనే కామెంట్లు వచ్చేలా ఈ ఇద్దరు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి మెప్పించారు. ఆడియెన్స్ ని అలరించారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం వర్ష, ఇమ్మాన్యుయెల్ తమ రిలేషన్ గురించి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్కిట్లలో పదే పదే వీరి మధ్య రిలేషన్‌ని బయటపెడుతున్నారు. మిగిలిన స్కిట్లు వర్కౌట్ కాకపోవడంతో దీన్నే నమ్ముకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వర్షకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమ్మాన్యుయెల్. బుల్లెట్ భాస్కర్‌పై ఇమ్మూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇందులో ఇమ్మాన్యుయెల్ `కేజీఎఫ్`లో యష్ పాత్రని చేయగా, వర్ష వాళ్ల అమ్మ పాత్రని చేసింది. ఇది స్టేజ్‌పై పర్‌ఫెర్మ్ చేశారు. ఇందులో వర్ష, ఇమ్మాన్యుయెల్ మొదటగా వచ్చారు. ఇందులో వర్ష.. బాబూ ఒక్కసారి అమ్మా అని పిలువు అంటూ కన్నీటి పర్యంతమవుతుంది.
దీనికి ఇమ్మాన్యుయెల్ రియాక్షన్ అదిరిపోయింది. `నేను చేయనురా ఈ క్యారెక్టర్ అని చెప్పా భాస్కర్ గాడికి, వాడి స్కిట్‌లోకి వచ్చినప్పట్నుంచి దీన్ని(వర్ష ని ఉద్దేశించి) అక్కని చేశాడు, చెల్లిని చేశాడు, లాస్ట్ కి నాకు తల్లిని చేశాడంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అందరి ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు ఇమ్మాన్యుయెల్. దీంతో షో మొత్తం నవ్వులు విరిసాయి. చివరికి వర్ష కూడా నవ్వులు పూయించడం విశేషమైతే, ఇమ్మాన్యుయెల్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు.
అనంతరం నాకోసం ఈ ప్రపంచంలో ఉన్న బంగారమంతా తీసుకొస్తావా అంటూ వర్ష అడగ్గా, ఇలాగే మొన్న కేజీఎఫ్ గనుల్లోకి వెళ్లమందండి.. తీరా అందులోకి వెళితే అవి బొగ్గుగనులట. వాడెవడో బొగ్గు అనుకుని నా తల మొత్తం చెక్కాడు అంటూ తన విగ్గు తీసి బట్టతల చూపించడం విశేషం. దీంతో మరోసారి షో మొత్తం నవ్వులు పూసాయి. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ స్కిట్ సాగింది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలోని స్కిట్ ఇది. వర్ష, ఇమ్మాన్యుయెల్, భాస్కర్‌లు కలిసి పాపులర్ సినిమాల స్ఫూఫ్ స్కిట్లు చేశారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో రష్మి గౌతమ్ యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణభగవాన్, ఖుష్బూ జడ్జ్ లుగా ఉన్నారు. ఇందులో ఖుష్బు చెప్పిన డైలాగ్‌లకు, కృష్ణభగవాన్ రియాక్షన్ సైతం హైలైట్‌గా నిలిచింది.