- Home
- Entertainment
- జాకెట్ వేసుకోకుండా ఈషా రెబ్బా చిలిపి పోజులు.. ముద్దు పెడుతూ కిర్రాక్ లుక్.. ప్రేమని పంచుతున్న డస్కీ బ్యూటీ
జాకెట్ వేసుకోకుండా ఈషా రెబ్బా చిలిపి పోజులు.. ముద్దు పెడుతూ కిర్రాక్ లుక్.. ప్రేమని పంచుతున్న డస్కీ బ్యూటీ
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. ఇటీవల `దయా` వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

తెలుగు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బా. కానీ అవకాశాలే రావడం లేదు. దీంతో ఆమె కెరీర్ స్ట్రగులింగ్‌లో సాగుతుంది. చాలా గ్యాప్‌తో తెలుగులో `దయా` వెబ్ సిరీస్‌లో నటించింది. గర్బవతిగా ఆమె అద్బుతంగా నటించింది. దీంతో ఈషా రెబ్బా నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది ఈషా రెబ్బా. `దయా`ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ముద్దులు పెడుతూ, లవ్ సింబల్స్ తో ప్రేమని పంచుకుంది. మీ ప్రేమకి ధన్యవాదాలు అని పేర్కొంది. అలివేలుని ఇష్టపడి, సపోర్ట్ చేస్తున్న అందరికి ప్రేమని పంచింది ఈషా రెబ్బా.
ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె జాకెట్ లేకుండా కనిపించడం విశేషం. తన డస్కీ అందాలతో కనువిందు చేస్తుంది. పరువాల విందు వడ్డిస్తూ ఆకట్టుకుంటుంది. చిలిపి పోజులతో కేకపెట్టిస్తుంది. ప్రస్తుతం ఈషా రెబ్బా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ `దయా`. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఈషా రెబ్బా కీలకపాత్ర పోషించింది. విష్ణుప్రియా కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అయితే ఇందులో ఈషా రెబ్బా డీ గ్లామర్ రోల్ చేయడం విశేషం. ఆమె ప్రెగ్నెంట్ లేడీగా కనిపించింది. అనేక స్ట్రగుల్స్ అనుభవించే మహిళగా అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తను ఇలా థ్యాక్స్ చెప్పింది.
ఇక ఈషా రెబ్బా సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గతుకు రోడ్లపై ప్రయాణంలా సాగుతుంది. అవకాశాల కోసం వేచి చూస్తుంది. ఈబ్యూటీని ఎవరూ ఎంకరేజ్ చేయడం లేదు. మధ్యలో ఒకటి రెండు తమిళ, మలయాళ చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా ఆ తర్వాత అవకాశాలు బంద్ అయ్యాయి. దీంతో కెరీర్ డైలామా పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో టాలీవుడ్‌లో అవకాశాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం `దయా`లో మెరవడంతోపాటు హీరో సుధీర్‌బాబుతో కలిసి `మామా మశ్చింద్ర` చిత్రంలో నటిస్తుంది. వీటితోపాటు మరో ఒకటి రెండు సినిమాలు ఈషా చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అడపాదడపా ఛాన్స్ లతో కెరీర్‌ని నెట్టుకొస్తుంది ఈషా. ఇకనైనా ఆ బ్యూటీ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాలి.