పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. బాంబ్ పేల్చిన ఈషారెబ్బా.. తండ్రెక్కడ అంటూ ప్రశ్నించిన సుమ..
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా.. హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మెరుస్తుంది. కెరీర్‌ని లాక్కొస్తున్న ఈ తెలుగు అందం.. తనకు ఇద్దరు పిల్లలున్నారంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చింది.
Eesha Rebba
ఈషా రెబ్బా.. తెలుగు హీరోయిన్‌గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు అందుకుంది. కానీ సెకండ్ రేంజ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. పెద్ద ప్రాజెక్ట్ లు రాలేదు. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే ఉందీ డస్కీ అందాల సోయగం. ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తుంది.
photo credit-suma adda
ప్రస్తుతం ఈషా రెబ్బా.. జేడీ చక్రవర్తితోపాటు `దయా` వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలోనే రిలీజ్ కాబోతుంది. దీంతోపాటు `మాయాబజార్` అనే వెబ్ సిరీస్ చేసింది. ఇది ఇటీవల విడుదలై స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా ఈ టీమ్.. ఈషా రెబ్బాతోపాటు రవి వర్మ, జెస్సీ, గౌతమి చెల్లాగుల్లా.. సుమ యాంకర్‌గా చేసే `సుమ అడ్డా` షోలో పాల్గొన్నారు. తమదైన డాన్సులు, చిలిపి ఆన్సర్లు, పంచ్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు.
photo credit-suma adda
ఇందులో సుమ ఓ టాస్క్ పెట్టింది. తొందగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందని ప్రశ్నించింది. దీనికి ఈషా రెబ్బా బజర్ నొక్కుతూ తొందరపడినప్పుడు అంటూ బాంబ్ పేల్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. నవ్వులు పూయించారు. షో మొత్తం నవ్వులు విరిసింది.
photo credit-suma adda
అనంతరం మీ ప్రేమ గురించి చెప్పమని సుమ.. ఈషా రెబ్బాని ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందీ డస్కీ బ్యూటీ. నిజానికి నాకు ఇద్దరు పిల్లలున్నారంటూ బాంబ్ పేల్చింది. ఈషా రెబ్బ ఆన్సర్‌కి సుమకి ఫ్యూజులెగిరిపోయాయి. దీంతో ఆగలేక సుమ అడిగేసింది. వాళ్ల నాన్న ఎక్కడుంటారు అని. దీనికి ఈషా రెబ్బా ఆన్సర్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. `సుమ అడ్డా` షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. మరి ఈషా రెబ్బ ఏం చెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారింది.ఈ నెల 22న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
photo credit-suma adda
ఇక ఈషా రెబ్బా.. `అంతకు ముందు ఆ తర్వాత` సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈషా. దీంతో బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే వరుసగా చిన్న బడ్జెట్ చిత్రాలే వచ్చాయి. `బందిపోటు`, `అమితుమీ` చిత్రాలతో విజయాలు అందుకుంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. కానీ చిన్న సినిమాలకే పరిమితమయ్యిందీ బ్యూటీ. `దర్శకుడు`, `అ`, `బ్రాండ్ బాబు`, `అరవింద సమేత వీరరాఘవ`, `సుబ్రమణ్యపురం`, `రాగల24 గంటల్లో` చిత్రాలు చేసింది. ఆ తర్వాత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. తమిళంలో, మలయాళంలో ఆఫర్లు దక్కించుకుంది. అక్కడ ఆకట్టుకుంది. కానీ నో ఆఫర్స్.
Eesha Rebba
దీంతో రూట్ మార్చింది. ఆల్టర్ నేట్ ఫ్లాట్‌ఫామ్‌ని ఎంచుకుంది. డిటిటల్‌రంగాన్ని అందిపుచ్చుకుంది. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ఆ మధ్య `3రోజెస్`, `పిట్టకథలు`లో మెరిసింది. ఇటీవల `మాయాబజార్`లో ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. త్వరలో `దయ`తో రాబోతుంది. సుధీర్‌బాబుతో `మామ మశ్చింద్ర` చిత్రలో నటిస్తుంది. తమిళంలో ఓ సినిమా కూడా చేస్తుందీ అందాల భామ.