MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్యాన్స్ కి పూర్ణ దసరా ట్రీట్... లంగా ఓణీలో పద్దతిగా అందాలు వడ్డించిన కేరళ భామ!

ఫ్యాన్స్ కి పూర్ణ దసరా ట్రీట్... లంగా ఓణీలో పద్దతిగా అందాలు వడ్డించిన కేరళ భామ!

దసరా పండగ వేళ హీరోయిన్ పూర్ణ సంప్రదాయ దుస్తుల్లో తయారయ్యారు. లంగా ఓణీ ధరించి నిండైన అందాలతో మెస్మరైజ్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 05 2022, 10:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Purnaa

Purnaa

పూర్ణ లుక్ చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టమే. ముక్కెర ఆమె అందాన్ని మరింత పెంచింది. కేరళ కుట్టి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్య పూర్ణ సంప్రదాయ బట్టల్లో మాత్రమేకనిపిస్తున్నారు. ఆమెకు పెళ్లి కుదరడం కూడా దీనికి కారణం కావచ్చు.

210
Purnaa

Purnaa

పూర్ణ పెళ్లి తేదీపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చంటున్నారు. కాగా వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ కాబోయే భర్తగా పూర్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.

310
Purnaa

Purnaa

పూర్ణ పెళ్లి వార్త ఆమె అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. పెళ్ళైతే ఆమె వెండితెరకు దూరం అవుతుందని బాధపడుతున్నారు. వివాహం తర్వాత పూర్ణ చిత్రాలు చేస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. 

410
Purnaa

Purnaa

 షానిద్ బాగా ధనవంతుడని సమాచారం.  పెళ్లితో పూర్ణ లైఫ్ లో చక్కగా సెటిల్ కానుంది. నటిగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూర్ణకు మంచి లైఫ్ పార్టనర్ దొరికాడు. వీరిది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా? అనేది తెలియదు. 
 

510
Purnaa

Purnaa

ఇక పూర్ణ కెరీర్ గురించి చెప్పాలంటే ఆమెకు మంచి ఆరంభం దొరికినా ఉపయోగించుకోలేకపోయారు. పూర్ణ మలయాళ చిత్రం మంజు పోలూరు పెన్కుట్టి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం శ్రీమహాలక్ష్మి. ఆమెకు సీమటపాకాయ్ మూవీతో సూపర్ హిట్ దక్కింది. అల్లరి నరేష్ నరేష్ నటించిన కామెడీ ఎంటెర్టైనర్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. 

610
Purnaa

Purnaa


నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ సిరీస్ అవును, అవును 2 చిత్రాల్లో పూర్ణ నటించారు. ఈ రెండు కూడా ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయితే ఆమె టాలీవుడ్ లో గట్టి పునాది వేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆమె కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. 
 

710
Purnaa

Purnaa


 పూర్ణ 3 రోజెస్ మూవీలో ఒక హీరోయిన్ గా పూర్ణ నటించారు. ఆహా లో విడుదలైన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా నటించారు. ఈ మూవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేశారు.

810
Purnaa

Purnaa

ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అఖండ మూవీ ప్రభుత్వ అధికారిణి పాత్రలో మెప్పించిన పూర్ణ, దృశ్యం 2 మూవీలో లాయర్ గా ఆకట్టుకున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ పాత్రలకు ప్రశంసలు దక్కాయి.
 

910
Purnaa

Purnaa


కొన్నాళ్లుగా పూర్ణ బుల్లితెరపై సైతం అలరిస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ 13 జడ్జిగా ఆమె వ్యవహరించారు. హీరోయిన్ పూర్ణతో పాటు జడ్జి సీట్లో కూర్చొని ఎంటర్టైన్ చేశారు. మంచిగా పర్ఫార్మ్ చేసిన డాన్స్ కంటెస్టెంట్స్ బుగ్గలు కొరుకుతూ పూర్ణ సంచలనాలకు తెరలేపారు. 

1010
Purnaa

Purnaa

మొత్తంగా పూర్ణ కెరీర్ యావరేజ్ గా సాగుతుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం కానుందట. నెలల వ్యవధిలో వివాహ వేడుక ఉండగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేయకపోవచ్చు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని ఇది తీవ్రంగా నిరాశ పరిచే అంశమే అని చెప్పాలి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image2
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Recommended image3
Dhanush Kara Release Date: రాంచరణ్ పెద్దికి పోటీగా దిగుతున్న ధనుష్.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved