MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ఫ్లాప్ మూవీ కథతో వచ్చి దుమ్ములేపుతున్న హాలీవుడ్ చిత్రం.. గ్రాండ్ విజువల్స్ కి ఫిదా

మహేష్ బాబు ఫ్లాప్ మూవీ కథతో వచ్చి దుమ్ములేపుతున్న హాలీవుడ్ చిత్రం.. గ్రాండ్ విజువల్స్ కి ఫిదా

సినిమా విజయానికి కథ చాలా కీలకం. కొన్నిసార్లు మంచి కథలు కూడా సినిమాలని కాపాడలేవు. సినిమా విజయానికి దర్శకుడు తెరకెక్కించే విధానం, ఆడియన్స్ కి కనెక్ట్ కావడం లాంటి అంశాలు ఆధారపడి ఉంటాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 03 2024, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా విజయానికి కథ చాలా కీలకం. కొన్నిసార్లు మంచి కథలు కూడా సినిమాలని కాపాడలేవు. సినిమా విజయానికి దర్శకుడు తెరకెక్కించే విధానం, ఆడియన్స్ కి కనెక్ట్ కావడం లాంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని చిత్రాలు కథలు అద్భుతంగా ఉన్నా తెరకెక్కించిన విధానం వల్ల ఫ్లాప్ అవుతుంటాయి. ఆ కోవకి చెందిన చిత్రమే మహేష్ బాబు ఖలేజా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్ర కథలో ఎలాంటి లోపం లేదు. కానీ త్రివిక్రమ్ ఈ కథని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యారు. కానీ ఇదే కథతో మార్చి 1న విడుదలైన ఒక హాలీవుడ్ చిత్రం దుమ్ములేపుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆ చిత్రం పేరు డ్యూన్ 2. తిమోతి ఛాల్మెట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 

36

ఖలేజా కథ ఈ చిత్రంలో అచ్చు గుద్దినట్లు ఉందని చెప్పలేం కానీ దాదాపు రెండు చిత్రాల కథ ఒకటే. ఖలేజా చిత్ర కథ ఏంటో అందరికి తెలుసు. డ్యూన్ 2లో తండ్రిని కోల్పోయిన హీరో తిమోతి తన తల్లితో కలసి అకీరాస్ గ్రహంలోని ఫ్రెమేగ్ అనే తెగ ప్రజల దగ్గరికి చేరుకుంటాడు. ఫ్రెమేగ్ తెగ ప్రజలు ఆ సమయంలో ఒక ఆపదలో ఉంటారు. 

46

తమని రక్షించే దేవుడి కోసాం ఎదురుచూస్తుంటారు. మిమ్మల్ని రక్షించే రక్షకుడు తన కొడుకే అని పాల్ అట్రిడియాస్ (తిమోతి) తల్లి ఆ ప్రజలకు చెబుతుంది. కానీ పాల్ కి ఆ ప్రజలపై అసలు ఆసక్తి ఉండదు. కానీ అకీరాస్ గ్రహంతో ఎంతో విలువైన ఒక డ్రగ్ దొరుకుతుంది. దానిని దక్కించుకోవడానికి విలన్ తన ఆర్మీతో ప్రయత్నిస్తుంటాడు. ఫ్రెమేగ్ తెగని అంతం చేసి ఆ డ్రగ్ ని పొందాలని అనుకుంటాడు. పాల్ తండ్రిని చంపింది కూడా విలనే. ఇక హీరోఫ్రెమేగ్ తెగకి రక్షకుడిగా మారాడా ? తన తండ్రి చావుకు పగ తీర్చుకున్నాడా అనేది మిగిలిన కథ. 

56

ఖలేజా చిత్రంలో కూడా ఊరి ప్రజలని నాశనం చేసి అక్కడ దొరికే విలువైన ఖనిజాన్ని దోచుకోవాలని విలన్ ప్రయత్నిస్తుంటాడు. తమని రక్షించే దేవుడు నువ్వే అని ఊరి ప్రజలు మహేష్ కి చెప్పినా అతడు పట్టించుకోడు. ఇదే తరహా కథతో వచ్చిన డ్యూన్ 2 హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. క్రిటిక్స్ నుంచి కూడా యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. డెనిస్ విలీనవ్యూ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజువల్ వండర్ గా ఆకట్టుకుంటోంది. 

66

ఆ విధంగా ఖలేజా చిత్ర కథతో వచ్చిన డ్యూన్ 2 అద్భుతంగా రాణిస్తోంది. కానీ ఖలేజా మాత్రం మహేష్ కెరీర్ లో ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏ చిత్రంలో వార్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కళ్ళు చెదిరేలా అనిపిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dada - Title Glimpse: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'.. మాస్ అండ్ స్టైలిష్ గా గ్లింప్స్
Recommended image2
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image3
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved