- Home
- Entertainment
- 100 కోట్ల సినిమా ఓటీటీ రిలీజ్ ? ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?
100 కోట్ల సినిమా ఓటీటీ రిలీజ్ ? ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఓటీటీ రిలీజ్ కు ముస్తాబవుతోంది.

మారుమోగుతోన్న ప్రదీప్ రంగనాథన్ పేరు
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ప్రదీప్ రంగనాథన్ పేరే వినిపిస్తోంది. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారాడు ప్రదీప్. ప్రస్తుతం వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్నాడు. తాజాగా డ్యూడ్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు ప్రదీప్. ఇక త్వరలో ఈసినిమాతో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాడు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన డ్యూడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఆడియన్స్ నుంచి ఈసినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది.
100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన థియేటర్లకు విడుదలైంది. డ్యూడ్ విడుదలకు ముందే ప్రదీప్ రంగనాథన్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ను సాధించారు. గతంలో డ్రాగన్ లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించాడు ప్రదీప్. వాటితో పాటు ఈమూవీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ప్రదీప్ కు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక డ్యూడ్ సినిమాలో హీరోయిన్ గా మమితా బైజు నటించగా.. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన ఈసినిమాను సుమారుగా 25 కోట్లతో నిర్మించగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
డ్యూడ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ప్రస్తుతం డ్యూడ్ ఓటీటీ రిలీజ్ పై ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన డ్యూడ్ ఓటీటీలో కూడా భారీగా రెస్పాన్స్ ను రాబడుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.
మారిపోయిన ప్రదీప్ లైఫ్
డైరెక్టర్ గా కెరీర్ ను కోమలి సినిమాతో స్టార్ట్ చేసిన ప్రదీప్.. ఈసినిమా విజయం తరువాత దర్శకత్వం నుండి నటన వైపు అడుగుపెట్టాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చేసిన “లవ్ టుడే” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా యూత్ లో భారీగా క్రేజ్ ను సాధించింది. పెద్ద హిట్‌గా నిలిచి, 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన “డ్రాగన్”. “డ్యూడ్” సినిమాలు కూడా వరుస బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇలా మొదటి మూడు సినిమాలతోనే 100 కోట్ల మార్క్‌ను దాటిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ కొత్త రికార్డు నెలకొల్పాడు.
ప్రదీప్ రంగనాథన్ సినిమాలు
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా చిత్రం “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ”. ఈ సినిమాను నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తుండగా, సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబుతో అవకాశం పోయినా.. అక్కడితో ఆగిపోకుండా.. తన టాలెంట్ ను నిరూపించుకుని స్టార్ గా నిలిచాడు ప్రదీప్ రంగనాథన్.