- Home
- Entertainment
- అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్ శెట్టి.. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారి ఇద్దరు కెప్టెన్లు
అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్ శెట్టి.. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారి ఇద్దరు కెప్టెన్లు
bigg boss telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమన్ శెట్టి మళ్లీ బ్యాక్ కి వెళ్లాడు. అధ్యక్ష్యా అంటూ రచ్చ చేశాడు.

సుమన్ శెట్టి విశ్వరూపం
బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం షో గతంతో పోల్చితే కాస్త ఆసక్తికరంగా, ఇంకాస్త రంజుగా సాగింది. పాత కంటెస్టెంట్లకి, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకి మధ్య కొన్ని గొడవలు షోని రక్తికట్టించాయి. ముఖ్యంగా దివ్వెల మాధురీ ఎంట్రీతో కథ మారిపోయింది. ఆమె హౌజ్‌లో డిక్టేటర్‌షిప్‌ని కొనసాగిస్తుంది. కొత్త రూల్స్ క్రియేట్ చేస్తోంది. తనే రూలర్‌గా మారుతుంది. ఈ క్రమంలో శుక్రవారం(40వ) ఎపిసోడ్ కాస్త డ్రామాతో, ఇంకాస్త ఫన్నీతో, అదే సమయంలో హీటెక్కించేలా సాగింది. కెప్టెన్సీ టాస్క్ లో సుమన్‌శెట్టి తన విశ్వరూపం చూపించారు. టాస్క్ లో రెచ్చిపోయి ఆడాడు. విన్నర్‌గా నిలిచాడు. వాహ్ అనిపించాడు.
సుమన్ శెట్టి, గౌరవ్ ఈ వారం కెప్టెన్స్ గా ఎంపిక
ప్రతి వారం శుక్రవారం సమయంలో కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ వారం కూడా ఇచ్చారు. అయితే ఈ సారి మూడు జంటలు ఇందులో పాల్గొన్నాయి. వారిలో సుమన్ శెట్టి-గౌరవ్ గుప్తా ఒక జంటగా, దివ్వెల మాధురీ-ఆయేషా మరో జంటగా, రమ్య-శ్రీనివాస సాయి మూడో జంటగా కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నారు. ఇందులో ముగ్గురుని శవపేటికలో పెడతారు. వారిని జంట పెయిర్స్ లాక్‌ని కన్నుక్కొని తీయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే మొదట తీసి గంట కొడతారో, వాళ్లే విన్నర్. ఇందులో ఆయేషా మొదటగా లాక్ కన్నుకొని వెళ్లినా, లాక్ తీయలేకపోయింది. ఆ తర్వాత వెళ్లిన గౌరవ్ గుప్తా తన పార్టనర్ లాక్ తీసి గంటకొట్టారు. విన్నర్ అయ్యారు. ఆ తర్వాత ఆయేషా లాక్ కనుక్కొని వెళ్లింది. కానీ అప్పటికే సుమన్ శెట్టి, గౌరవ్‌లు బయటకు వచ్చి గంట కొట్టారు. ఇందులో విన్నర్‌గా నిలిచారు. దీంతో ఎప్పుడూలేని విధంగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారి ఇద్దరిని ఒకేసారి కెప్టెన్ చేశారు.
అధ్యక్షా అంటూ సునీల్ శెట్టి ప్రమాణస్వీకారం
అయితే ఆ తర్వాత నిఖిల్‌కి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అతను గౌరవ్‌తో టాస్క్ లో పాల్గొని విన్నర్ అయి కెప్టెన్ అయ్యే అవకాశం కల్పించారు. కానీ ఇందులోనూ గౌరవ్ విన్నర్ అయ్యాడు. దీంతో ఏడో వారంలో సుమన్ శెట్టి, గౌరవ్ సంయుక్తంగా కెప్టెన్లుగా ఉండబోతున్నారు. ఇలా చేయడం, జరగడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాక.. ప్రమాణస్వీకారం చేశాడు. నీతి నిజాయితీతో ఉంటానని చెప్పాడు. అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్ శెట్టి తన మొదటి సినిమా `జయం`ని గుర్తు చేశారు. కాసేపు రెచ్చిపోయాడు. సుమన్ శెట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీనికితోడు సుమన్ శెట్టి ని పొగుడుతూ ఇమ్మాన్యుయెల్ మాట్లాడిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.
కన్నీళ్లుపెట్టుకున్న ఆయేషా
కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి, గౌరవ్ కలిసి ఆయేషాకి బెడ్ ఇచ్చారు. ఆమెని ఖుషీ చేశారు. ఎపిసోడ్ మధ్యలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కిచెన్ వద్ద ఆంట్లు క్లీన్ చేసే విషయంలో ఆయేషా జీనత్, రీతూ చౌదరీకి మధ్య గొడవ అయ్యింది. ఇందులో డీమాన్ పవన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యారు. కాసేపు బాగా రచ్చ అయ్యింది. ఇంకోవైపు తాను త్వరగా రాలేకపోయాను, లాక్ తీయలేకపోయానని ఆయేషా బాగా కన్నీళ్లు పెట్టుకుంది. తాను ముందుగానే వచ్చినా విన్నర్ కాలేకపోయానని తెలిపింది. గోల గోల చేసింది.