- Home
- Entertainment
- Ananya Panday Pics : అనన్య పాండేతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ రోజు ఆమె బర్త్ డే..
Ananya Panday Pics : అనన్య పాండేతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ రోజు ఆమె బర్త్ డే..
‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తనతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఈ అమ్మాయిలో ఎవరంటే..

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన కేరీర్ ను స్టార్ట్ చేసిన నాలుగేండ్లలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ మూవీలో హీరోయిన్ గా నార్త్ కు ఎంట్రీ ఇచ్చింది.
తన గ్లామర్, నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అటు నార్త్ తోపాటు.. ఇటు సౌత్ ను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ (Liger) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
లైగర్ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన నటిస్తోంది. ఇప్పటికే వీరి కెమిస్ట్రీపై ఆడియెన్స్ లో మంచి టాక్ వినిపిస్తోంది. లైగర్ మూవీకి సంబంధించి ఫిల్మింగ్ ఇప్పటికే పూర్తైయింది. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేళలకు ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ‘గెహ్రైయాన్’ (Gehraiyaan) మూవీలోనూ బోల్డ్ సీన్లలో నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీ గత నెల 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్సాన్స్ ను దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో తన క్రేజ్ మరింత పెంచుకుంటోందీ బ్యూటీ.
అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే తాజాగా ఓ అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే అనన్య పాండే సొంత చెల్లెలు రిసా పాండే (Rysa). ఆమె 18వ పుట్టిన రోజు సందర్భంగా అనన్యపాండే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
ఫొటోలు పంచుకుంటూ ‘18వ పుట్టినరోజున ఈ చిట్టెలుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ బెస్ట్ చెప్పింది. బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే కూతుర్లే అనన్య పాండే, రిసా పాండే. అనన్య పుట్టిన ఐదేండ్లకు రిసా పుట్టింది. ఇక అనన్య పాండే ఇటు లైగర్ తో పాటు.. ‘ఖో గయే హమ్ కహాన్’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం 2023లో రిలీజ్ కానుంది. అలాగే యాడ్ ఫిల్మ్ లోనూ నటిస్తూ సందడి చేస్తోంది అనన్య.