- Home
- Entertainment
- ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయన రెమ్యునరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయన రెమ్యునరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
భారతీయ చిత్రాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంటున్నాయి. ఈ విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ల పాత్ర కూడా ఎంతగానో ఉంది. అయితే ప్రజెంట్ లో ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరనేది తెలుసుకుందాం.

ఇండియాలో ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి వంటి వారు చాలా మందే ఉన్నారు.
Rockstar Anirudh
అయితే ప్రస్తుతం మాత్రం ఇండియా మొత్తంగా మ్యూజిక్ వరల్డ్ ను ఏలుతున్నది మాత్రమే ఒక్కరే అని చెప్పాలి. మరి ఆయన ఎవరో కాదు సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కావడం విశేషం.
Anirudh
ఆయన కెరీర్ తమిళంలో ప్రారంభమైంది. ధనుష్‘3’ మూవీకి అద్భుతమైన సంగీతం అందించి సంగీత ప్రియులకు బాగా దగ్గరయ్యారు. 2012లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నుంచి అనిరుధ్ బిగ్ స్టార్స్ కు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు.
తెలుగులోనూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి (Agnyaathavaasi), నాని ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, సమంత ‘యూటర్న్’ వంటి చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించారు. ఇలా తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
ఇక గతేడాది బాలీవుడ్ డెబ్యూతోనూ అదరగొట్టారు అనిరుధ్. బాలీవుడ్ కింగ్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘జవాన్’ (Jawan)కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ దుమ్ములేచిపోయింది. దీంతో ఇండియా మొత్తం ఆయన సంగీతానికి భారీ డిమాండ్ పెరిగింది.
అంతేకాదు.. ‘జవాన్’ చిత్రానికి ఇండియాలో అత్యధికంగా రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు అనిరుధ్. ఇదే టాప్ కావడం విశేషం. నెక్ట్స్ దేవర (Devara), ఇండియన్ 2, లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్, ఎస్కే23 వంటి చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. దేవీశ్రీ, థమన్, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణీలందరినీ దాటి అనిరుధ్ టాప్ డైరెక్టర్ గా నిలవడం ఆసక్తికరంగా మారింది.