- Home
- Entertainment
- Prabhas : ప్రభాస్ కు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? కానీ కలిసి నటించడం కుదరదంటున్న డార్లింగ్!
Prabhas : ప్రభాస్ కు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? కానీ కలిసి నటించడం కుదరదంటున్న డార్లింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్ సరసన టాప్ హీరోయిన్లు నటించేందుకు ఇష్టపడుతున్నారు. కానీ రెబల్ స్టార్ మాత్రం ఇంకో హీరోయిన్ నటనను ఇష్టపడుతుండటం ఆసక్తికరంగా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్స్ అందుకున్న డార్లింగ్ రీసెంట్ గా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ Salaar Cease Fireతో సక్సెస్ అందుకున్నారు.
‘సలార్’ తర్వాత ప్రభాస్ రాబోయే చిత్రాలపై మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. నెక్ట్స్ డార్లింగ్ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ Kalki 2898 Adతో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కల్కిలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. ఇలా డార్లింగ్ సరసన టాప్ హీరోయిన్లు నటించేందుకు ఇష్టపడుతున్నారు. నెక్ట్స్ ‘రాజా సాబ్’లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా. కానీ రెబల్ స్టార్ మాత్రం ఆ హీరోయిన్ నటనను ఇష్టపడుతుండటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గ్గా మారింది.
మరి ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్ మరెవరో కాదు.... లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi)నే. గతంలో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి నటన అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఆమెతో కలిసి వర్క్ చేయాలని ఉందని కూడా చెప్పారు.
కానీ హైట్ కారణంగా ఆమెతో కలిసి నటించడం కుదరడం లేదని చెప్పారు. ప్రభాస్ మారుతీ సినిమా ‘రాజా సాబ్’లో హీరోయిన్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో నెక్ట్స్ ఎవరు నటించబోతున్నారనే తరుణంలో డార్లింగ్ సాయిపల్లవి గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
సాయి పల్లవిని ఇష్టపడి నటుడు లేరనే చెప్పాలి. ఆమె చేసే సినిమాలు, వ్యక్తిగత జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నెక్ట్స్ చైతూతో కలిసి ‘తండేల్’తో అలరించబోతోంది. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మే 10న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.