ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? టాప్ ఫైవ్ లో ఉన్నది వీరే!
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే వీరిలో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్ గా మాత్రం ఆమె రికార్డు సెట్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ బ్యూటీ ఎవరో తెలుసుకుందాం.

సినీ పరిశ్రమలో ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడాలు పెద్దగా లేవు. పాన్ ఇండియా సినిమాలు, ఇండియన్ సినిమాగా అన్నీ భాషల చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అందులో ముందుంటున్నారు.
ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లుగా దీపికా పదుకొణె (Deepika Padukone), నయనతార, సమంత, అలియా భట్, రష్మిక మందన్న, కృతి సనన్ లు ఉన్నారు.
ఈ ముద్దుగుమ్మలే ఇండియాలోని భారీ చిత్రాల్లో హీరోయిన్లుగా మెరుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు చిత్రానికి రూ.10 కోట్ల వరకూ ఛార్జ్ కూడా చేస్తున్నారు. ప్రాజెక్ట్ ను బట్టి రెమ్యునరేషన్ ను డిసైడ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఇండియాలో రిచెస్ట్ యాక్ట్రెస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. లీడింగ్ లో ఉన్న నటీమణులు కాకుండా కొన్ని నివేదికల ప్రకారం మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది.
మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు... మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan). ఇప్పటికీ వరకు ఐశ్వర్య రాయ్ పేరు మీద రూ.776 కోట్ల ఆస్తులున్నాయి.
ఆ తర్వాత స్థానంలో ప్రియాంక చోప్రా రూ.620 కోట్లతో నిలిచింది. కరీనా కపూర్ (Kareena Kapoor) రూ.517 కోట్లు, దీపికా పదుకొణె రూ.314 కోట్లు, అనుష్క శర్మ రూ.255 కోట్లతో తదుపరి నాలుగు స్థానాల్లో ఉన్నారు.