- Home
- Entertainment
- మొన్న హరికృష్ణ , నేడు ఉమామహేశ్వరి .. ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్థులయ్యారో తెలుసా..?
మొన్న హరికృష్ణ , నేడు ఉమామహేశ్వరి .. ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్థులయ్యారో తెలుసా..?
టీడీపీ వ్యవస్థాపకులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే నందమూరి హరికృష్ణ ఆయన కుమారుడు జానకీరామ్ ఆకస్మిక మరణాలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వారి మరణాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అన్నగారి కుటుంబంలో తాజాగా ఉమామహేశ్వరి ఆత్మహత్య వారిని శోకసంద్రంలో ముంచింది.

<p style="text-align: justify;">రాజకీయా పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. అప్పటి వరకు రాష్ట్రాల్లో పెత్తనం చేస్తున్న జాతీయ పార్టీల హవాకు గండికొట్టి రీజినల్ పార్టీలను తెర మీదకు తీసుకువచ్చారు. </p>
సినీనటుడిగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా తెలుగు వారి హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ఆయన పాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలతో ఎన్టీఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచివుండే అతికొద్దిమంది వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు.
ntr
ఇకపోతే.. ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితాల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి పూర్తిగా తెలిసింది కొందరికీ. ముఖ్యంగా ఆయనకు ఎంతమంది సంతానం అన్న విషయం ఈ జనరేషన్‌లో తెలిసింది ఎంత అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎన్టీఆర్‌కు 12 మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు కాగా... నలుగురు కూతుళ్లు.
వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరే ముందే తన సతీమణి పురంధేశ్వరీ బీజేపీలోనే ఉంటుందని కూడ వైసీపీ నాయకత్వానికి కూడ స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరులు చెబుతున్నారు. ఆ సమయంలో వైసీపీ చీఫ్ జగన్ కూడ ఈ విషయమై తమకు ఇబ్బందులు లేవని చెప్పినట్టుగా సమాచారం.
వీరిలో కుమారులు నందమూరి రామకృష్ణ సీనియర్ , నందమూరి జయకృష్ణ, నందమూరి సాయికృష్ణ, నందమూరి హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, నందమూరి జయశంకర్ కృష్ణ కాగా.. కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.
హరికృష్ణ గారి బౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి పరిటాల సునీత
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. మరో కుమారుడు నందమూరి సాయికృష్ణ కూడా అనారోగ్యంతో 2004లో కన్నుమూశారు. ఇక అన్నగారికి ఎంతో ఇష్టమైన మరో కుమారుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్ట్‌లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు.
హరికృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు
ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడైన నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ 6న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైంది.
ఎన్టీఆర్ కుటుంబంలో బయటి ప్రపంచానికి తెలిసినవారు కొందరే. వీరిలో ఉమామహేశ్వరి కూడా ఒకరు. కుటుంబ వేడుకలు, ఫంక్షన్లలో మాత్రమే ఆమె కనిపించేవారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడటంతో దీనిని ఖండించేందుకు మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
ntr
ఇకపోతే.. ఈ ఏడాది మొదట్లో చిన్న కుమార్తె దీక్షిత వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఉమామహేశ్వరి. దాదాపు పాతికేళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు కలుసుకుంది ఈ పెళ్లిలోనే. ప్రస్తుతం అంతా సంతోషంగా వున్న సమయంలో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది.