పూర్ణ కాబోయే భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?.. సెలబ్రిటీ లైఫ్ స్టయిల్..
హీరోయిన్ పూర్ణ తనకు కాబోయే వాడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. షానిద్ బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు, పూర్ణ అభిమానులు.

హాట్ హీరోయిన్ పూర్ణ ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు సడెన్‌గా అభిమానుల గుండెల్లో బాంబ్ పేల్చింది. తనకి ఎంగేజ్‌మెంట్ అయినట్టు ప్రకటించి షాకిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త అన్ని సామాజిక మాధ్యమాల్లో, అటు చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతుంది. అత్యంత క్రేజీ న్యూస్‌గానూ నిలుస్తుంది.
పూర్ణ చేసుకోబోయే షానిద్ అసిఫ్ అలీ యూఏఈ బేస్డ్ గా రాణిస్తున్న వ్యాపారవేత్త. ఆయన కేరళకి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్. జమా అల్మెహరి అనే కంపెనీని సైతం స్థాపించారు. ఆఫీసు ప్రారంభించడానికి కావాల్సిన సర్వీసులను అందిస్తుంటారు.
దీంతోపాటు ఆయన ప్రధానంగా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను అందిస్తుంటారు. వీసా ప్రాసెసింగ్, ఫ్లైట్ టికెటింగ్ వంటి పలు సర్వీసులను షానిద్ కంపెనీ అందిస్తుంది. ఇప్పటికే ఆయన అనేక మంది సినిమా సెలబ్రిటీలకు యూఎఈ వీసాలను అందించారు.
షానిద్ కంపెనీ నుంచి వీసాలు అందుకున్న వారిలో కాజల్, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్ సేతుపతి, స్వేతా మీనన్, నాజర్, అజారుద్దీన్ వంటి అనేక మంది సినీ తారలున్నాయి. తెలుగు, కన్నడం, మలయాళం, కేరళా సినీ ఇండస్ట్రీలకు చెందిన వీసాలున్నాయి.
కేరళా సినీ సెలబ్రిటీలతో ఆయనకు మంచిపరిచయాలున్నాయి. వీసా ప్రాసెసింగ్‌లో ఆయన సహాయం చేస్తుంటారు. మరోవైపు ఎన్‌ఆర్‌ఐ ఎంటర్ ప్రెన్యూర్‌గా కేరళా సీఎం పినరయి విజయన్ నుంచి అవార్డుని కూడా అందుకున్నారు. అంతేకాదు ఆయనది కూడా ఓ సెలబ్రిటీ లైఫ్ స్టయిల్. దుబాయ్ వంటి కంట్రీస్‌లో ఆయన ఎంజాయ్ చేస్తుంటారు. ముస్లీం మత పెద్దలతోనూ ఆయనకు మంచి పరిచయాలున్నాయి. లగ్జరీ లైఫ్ ఆయన సొంతం.
చాలా కాలంగా పూర్ణ ఫ్యామిలీతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. పూర్ణకి కూడా ఆయనకు యూఏఈ వీసా అందించారు. ఆ మధ్య కేరళాలో ఓ సినిమాకి సంబంధించిన వేడుకలోనూ షానిద్‌తోపాటు పూర్ణ పాల్గొన్నారు. చూడబోతుంటే, చాలా రోజులుగానే వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందని, అది ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాకపోతే అది పెద్దల సమక్షంలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు.
ఇక బుధవారం తన కాబోయే భర్తని పూర్ణ ప్రకటిస్తూ, `ఫ్యామిలీ మెంబర్స్ ఆశీర్వాదంతో నాజీవితంలో తదుపరి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నా. నిశ్చితార్థం జరిగింది. ఇట్స్ అఫీషియల్ అని షానిద్‌తో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుంది పూర్ణ.
ఇక పూర్ణ తెలుగుతోపాటు సౌత్‌లోనూ నటిగా రాణిస్తుంది.మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ రాణించిన ఆమె 2007లో `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది.`సీమటపాకాయ్`తో మంచి విజయాన్ని అందుకుంది. రవిబాబు `అవును` సక్సెస్‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాట్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది.
ఆ తర్వాత `లడ్డుబాబు`, `నువ్విలా నువ్విలా`, `అవును 2`, `రాజుగారి గది`, `మామ మంచు అల్లుడు కంచు`, `జయమ్ము నిశ్చయమ్ము రా`, `అవంతిక`, `రాక్షసి`, `సిల్లీ ఫెలో`, `అదుగో`, `సువర్ణ సుందరి`, `పవర్ ప్లే`,`సుందరి`, `దృశ్యం 2`, `అఖండ` చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలతో బిజీగా ఉంది.ఇటీవల 'కామెడీ స్టార్స్ ధమాకా', 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా సందడి చేశారు.