కె.రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ రెండో పెళ్లి.. ఫోటోలు
First Published Jan 5, 2021, 8:48 PM IST
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి మాజీ భార్య కనికా థిల్లాన్ రెండో పెళ్లి చేసుకుంది. హిందీకి చెందిన రచయిత హిమాన్షు శర్మని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీనిటి కనికా పంచుకుంది.

దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ప్రకాష్ కోవెలమూడి కూడా దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన తెలుగు `సైజ్ జీరో`, హిందీ `జడ్జ్‌మెంటల్ హై క్యా` వంటి సినిమాలు రూపొందించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఆయన్నుంచి నాలుగేళ్ల క్రితం కనికా థిల్లాన్ విడాకులు తీసుకుంది.

కొన్నాళ్ళుగా బాలీవుడ్ రైటర్ హిమాన్షు వర్మతో చనువుగా ఉంటుంది. వీరిద్దరు కలిసి పలు సినిమాలకు పనిచేశారు. ఈ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్లింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?