- Home
- Entertainment
- పాపం.. గుణశేఖర్ కి ఇంత అన్యాయమా.. హిరణ్య కశ్యప నుంచి అవుట్, రానా క్లారిటీ ఇస్తాడా ?
పాపం.. గుణశేఖర్ కి ఇంత అన్యాయమా.. హిరణ్య కశ్యప నుంచి అవుట్, రానా క్లారిటీ ఇస్తాడా ?
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల కథని అపురూప ప్రేమ కావ్యంగా చూపించబోతున్నారు గుణశేఖర్.

Suresh babu
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల కథని అపురూప ప్రేమ కావ్యంగా చూపించబోతున్నారు గుణశేఖర్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా 'హిరణ్య కశ్యప' చిత్రం తెరకెక్కించడం గుణశేఖర్ డ్రీమ్. ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. సురేష్ బాబు నిర్మాణంలో, రానా దగ్గుబాటి టైటిల్ రోల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ఎంతగానో శ్రమించారు. స్క్రిప్ట్ వర్క్ ని ఒక షేప్ కి తీసుకురావడం కోసం గుణశేఖర్ ప్రాణం పెట్టారు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలనేది గుణశేఖర్ కల.
కానీ ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా గుణశేఖర్ ని తప్పించినట్లు స్పష్టం అయింది. ఇటీవల ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ.. హిరణ్య కశ్యప చిత్రం తమ ప్రొడక్షన్ లోనే ఉంటుంది . కానీ దర్శకుడు వేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంటే విభేదాలు తలెత్తడంతో గుణశేఖర్ ని పక్కన పెట్టేసినట్లు స్పష్టం అవుతోంది. గుణశేఖర్ తప్పుకున్నప్పటికీ హిరణ్య కశ్యప చిత్రాన్ని తమ బ్యానర్ లోనే తెరకెక్కిస్తాం అని సురేష్ బాబు అంటున్నారు. మరి హిరణ్య కశ్యప కథపై హక్కులు ఎవరివి ? గుణశేఖర్ ఇన్నేళ్ల కష్టం వృధానేనా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దర్శకుడిగా గుణశేఖర్ హిరణ్య కశ్యప స్క్రిప్ట్ విషయంలో ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మరి గుణశేఖర్ ని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతోంది. గుణశేఖర్ కి తీరని అన్యాయం జరిగింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో క్లారిటీ రావాలంటే రానా దగ్గుబాటి క్లారిటీ ఇవ్వాలి. లీడర్, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో రానా అద్భుతమైన నటుడిగా గుర్తింపు పొందాడు. కానీ హీరోగా భారీ సక్సెస్ ఇంకా అందుకోలేదు.