- Home
- Entertainment
- తన భార్యని అలా చూస్తూ ఉండిపోయాడట.. వెన్నెల కిషోర్ షోలో తన లవ్ స్టోరీ బయటపెట్టిన `కార్తికేయ2` డైరెక్టర్..
తన భార్యని అలా చూస్తూ ఉండిపోయాడట.. వెన్నెల కిషోర్ షోలో తన లవ్ స్టోరీ బయటపెట్టిన `కార్తికేయ2` డైరెక్టర్..
దర్శకుడు చందూ మొండేటికి తన భార్యని చూస్తుంటే టెన్షన్‌గా ఉందట. వెన్నెల కిశోర్ ముందే ఆమె దర్శకుడిని ఆటపట్టించడం హైలైట్‌గా నిలిచింది. `అలా మొదలైంది` షోలో ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండటం విశేషం.

`కార్తికేయ`, `ప్రేమమ్`, `కార్తికేయ2` చిత్రాల దర్శకుడు చందుమొండేటి.. తన భార్య సుజాతతో కలిసి కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్ గా రన్ అవుతున్న `అలా మొదలైంది` షోకి వచ్చారు. ఇందులో చందూ మొండేటిని ఆయన భార్య ఓ రేంజ్‌లో ఆడుకోవడం విశేషం. అయితే వెన్నెల కిశోర్ ముందే డైరెక్టర్ భార్య.. చందూ పరువు తీసింది. అంతేకాదు భార్యకి ఆ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు డైరెక్టర్. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.
మొదట తన భార్య సుజాత పరిచయం నుంచి చెప్పుకొచ్చాడు చందూ మొండేటి. బ్లాక్ అండ్ మధ్యలో కలర్‌ఫుల్‌గా ఈ అమ్మాయి కనిపించే సరికి అలా చూస్తూ ఉండిపోయాడట. దీనికి చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని వెన్నెల కిశోర్ చెప్పగా, తనకు ఇమ్మెచ్యూరేమో, నాకు మెచ్యూరే అని చందూ మొండేటి భార్య సుజాత చెప్పడం నవ్వులు పూయించింది.
మేం ఫోన్ కాల్ మాట్లాడుతుంటే, మరో ఆరు నెలల్లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారేమో అనుకునేవాళ్లట. దీనిపై తన భార్య సుజాత చెబుతూ, మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. `అవును, నాకు తెలుసు. స్మార్ట్ గా ఉన్నాడు` అని చందూ చెప్పగా, `స్మార్ట్ గా ఉన్నావని నేనేం అనలేదని` భార్య సుజాత చెబుతూ ఆయన పరువు తీసేసింది. `మీరు ఎప్పుడైనా సరదాగా మీ పార్ట్ నర్‌ని ఏడిపించారా?` అని అడగ్గా, ఏడిపిస్తూనే ఉన్నాను అని ఆమె, ఏడిపిస్తూనే ఉంది అని దర్శకుడు చెప్పడం నవ్వులు పూయించింది.
ఏవైనా కంప్లెయింట్స్ ఉన్నాయా అని అడగ్గా, ఏవైనా ఉంటే సుధీర్‌కి చెబుతుంటానని తెలిపింది. దీంతో కిశోర్ స్పందిస్తూ ఇప్పుడు నేను కూడా ఉన్నానమ్మా అని చెప్పడంతో ఎలా వెళ్లాలో భయమేస్తుందని చందూ చెప్పడం కామెడీని పంచింది. మ్యారేజ్‌కి ముందు మీరు చేసిన చిలిపి పని ఇప్పుడు రివీల్ చేయాలి అని అడగ్గా చందూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఆ తర్వాత `ఇన్ని బర్త్ డేలు అయ్యాయి కదా, ఒక బర్త్ డే` అని చెప్పగానే, మర్చిపోయారా? అని కిశోర్ అన్నాడు, దీనికి చందు రియాక్ట్ అవుతూ మర్చిపోతే ఇంకేమైనా ఉందా? అంటూ నోరు మూసుకోవడం హైలైట్.
కాజ్వల్‌గా మేడమ్ అలక ఎలా ఉంటుందని కిశోర్ అడగ్గా, కోప్పడుతున్నట్టుగా చందూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ రచ్చరచ్చ చేసేలా ఉన్నాయి. అంతేకాదు సినిమా రిలీజ్ రోజు టెన్షన్ ఉంటుంది కదా, అలా తనకు టెన్షన్ వస్తుందట. అంతేకాదు పెళ్లి రోజు చెబుతూ, డిసెంబర్ అంటూ ఆయనో డేట్ చెప్పగా, ఆమె ట్వెంటీ డిసెంబర్ అంటూ సీరియస్‌గా లుక్ ఇవ్వడంతో చందూ మొఖం వాడిపోయింది. అబద్దాలు ఎవరు ఎక్కువ చెప్తారని అడగ్గా, తాను తక్కువగానే చెబుతానని చందు చెప్పగా, ఆయన భార్య ఇచ్చిన లుక్ అదిరిపోయింది. దీనికి వెన్నెల కిశోర్ కౌంటర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.
అందమైన వాళ్లకి అణకువ ఉండదట అని తన భార్యని నొక్కి చెబుతుండగా, వెన్నెల కిశోర్ వేసిన పంచ్ అదిరిపోయింది. ఆ తర్వాత అమ్మవాళ్లు ఏం పేరు పెట్టారని భార్య సుజాత అడగ్గా, ఇప్పుడొద్దంటూ దర్శకుడు రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమె చెప్పేసింది. `హడావుడి కేంద్రం` అని పిలిచేవారట. దీనికి వెన్నెల కిశోర్ మరింత పులిహోర కలపడంతో నవ్వులువిరిస్తాయి. మొత్తంగా `అలా మొదలైంది` షోలో దర్శకుడు చందూ మొండేటి, ఆయన భార్య సుజాతల మధ్య కన్వర్జేషన్ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగడం విశేషం. ఇదిలా ఉంటే చందు కంటే ఆయన భార్య ఏజ్‌లో ఎక్కువగా ఉంటుందని చూస్తుంటే అర్థమవుతుంది. నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.