MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా స్కిన్ బ్లాక్ గా ఉందని కామెంట్స్ చేశారు, పెద్ద సినిమా నుంచి తీసేశారు..కానీ డైరెక్టర్ హరీష్ శంకర్..

నా స్కిన్ బ్లాక్ గా ఉందని కామెంట్స్ చేశారు, పెద్ద సినిమా నుంచి తీసేశారు..కానీ డైరెక్టర్ హరీష్ శంకర్..

అందం, డ్యాన్స్, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ డింపుల్ హయతి హీరోయిన్ గా సక్సెస్ కావడం లేదు. ఆమె చివరగా నటించిన ఖిలాడీ, రామబాణం రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.    

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 22 2024, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందం, డ్యాన్స్, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ డింపుల్ హయతి హీరోయిన్ గా సక్సెస్ కావడం లేదు. ఆమె చివరగా నటించిన ఖిలాడీ, రామబాణం రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.   

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

డింపుల్ హయతి గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమెకి నృత్యంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది. అందుకే ఏ చిత్రంలో అయిన డింపుల్ హయతి డ్యాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నటీమణులకు కెరీర్ బిగినింగ్ లో అవమానాలు, సూటిపోటి మాటలు సహజంగా మారిపోయింది. 

37

డింపుల్ హయతి కూడా అందుకు అతీతం కాదు. తనకంటూ ఒక గుర్తింపు రావడానికి చాలా కష్టపడిందట. చిన్నప్పుడు చదువుపై ఆసక్తి ఉండేది కాదు. సినిమాలంటే పిచ్చి. నా పిచ్చి చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. గల్ఫ్ లాంటి చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఓ పెద్ద డైరెక్టర్ దర్శకత్వంలో.. పెద్ద చిత్రంలో ఛాన్స్ వచ్చింది. నానా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఆ సమయంలో నన్ను మూవీ నుంచి తీసేశారు. ఈ విషయాలని డింపుల్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. 

47

ఆ మూవీలో నటిస్తునప్పుడే నాకు మరో మూడు పెద్ద చిత్రాల్లో ఛాన్సులు వచ్చాయి. అవి కూడా చేజారాయి. అందులో ఒక చిత్రం గద్దలకొండ గణేష్. ఆ చిత్రంలో ఫస్ట్ మెయిన్ హీరోయిన్ గా అనుకున్నది నన్నే అని డింపుల్ తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి కూడా తీసేశారు. ముందుగా నన్ను మూవీ నుంచి తీసేసిన వాళ్ళు ఈ అమ్మాయికి డ్యాన్స్ రాదు అంటూ ప్రాపగాండా చేయడం మొదలు పెట్టారు. మీకు డ్యాన్స్ రాదని ప్రచారం చేసారా అంటూ యాంకర్ షాక్ కి గురైంది. 

57

కొన్నిరోజుల తర్వాత హరీష్ శంకర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. డింపుల్ ఒకసారి ఆఫీస్ కి రా అని పిలిచారు. హీరోయిన్ రోల్ ఎలాగు కోల్పోయాం. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది చేస్తావా అని అడిగారు. మా ఇంట్లో వాళ్ళు వద్దు చేయొద్దు అన్నారు. హీరోయిన్ గా ట్రై చేస్తున్నప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తే ఆ ముద్ర పడిపోతుంది అని చెప్పారు. 

67

కానీ నాకు డ్యాన్స్ రాదు అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కోసం అయినా నిరూపించుకోవాలని అనే ఉద్దేశంతో గడ్డలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' అనే సాంగ్ చేసినట్లు డింపుల్ పేర్కొంది. కానీ ఆ సాంగ్ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎలాగైనా ఆడియన్స్ నన్ను గుర్తించాలి అనే కోరిక నెరవేరినట్లు డింపుల్ పేర్కొంది. 

 

77

అదే విధంగా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో నా స్కిన్ కలర్ గురించి చాలా మంది కామెంట్స్ చేశారు. నాది డార్క్ స్కిన్ అని, డస్కీగా ఉంటానని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. నా స్కిన్ కలర్ పై కామెంట్స్ చేస్తే నేనేం కుంగిపోలేదు. అప్పుడు స్కిన్ కలర్ పై చాలా పిచ్చి ఉండేది. ఇప్పుడు అది తగ్గుతూ వస్తోంది. నన్ను, నా స్కిన్ కలర్ ని ఇప్పుడు అంతా యాక్సప్ట్ చేస్తున్నారు. డింపుల్ డార్క్ చాక్లెట్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండడంతో హ్యాపీగా అనిపిస్తోంది అని పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image2
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image3
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved