- Home
- Entertainment
- నా మీదే పడి ఏడుస్తారు, పవన్ డైలాగ్ చెప్పి ప్లేట్ మార్చిన దిల్ రాజు.. చిరంజీవి, బాలయ్య నా హీరోలు..
నా మీదే పడి ఏడుస్తారు, పవన్ డైలాగ్ చెప్పి ప్లేట్ మార్చిన దిల్ రాజు.. చిరంజీవి, బాలయ్య నా హీరోలు..
ముందుగా దిల్ రాజు వారసుడు చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజాగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి వారసుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి చిత్రాలతో పాటు దిల్ రాజు తన వారసుడు చిత్రాన్ని కూడా సంక్రాంతికి దించుతున్నారు. అయితే ఈ చిత్రం తెలుగులో సంక్రాంతికి వస్తుందా రాదా అనే సందిగ్దత కొనసాగుతోంది. తెలుగు హీరోల సినిమాకి పోటీగా దిల్ రాజు తమిళ హీరో చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో పెద్ద వివాదమే జరుగుతోంది.
ముందుగా దిల్ రాజు వారసుడు చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజాగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి వారసుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. రెండు రోజులు ఈ చిత్రం తెలుగులో వాయిదా పడుతూ జనవరి 14న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు దిల్ రాజు ప్రకటించారు. సడెన్ గా దిల్ రాజు ఇలా ప్లేట్ మార్చడం ఆసక్తిగా మారింది.
వారసుడు చిత్రాన్ని రెండు రోజులు పోస్ట్ పోన్ చేయడం గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ న తెలుగు హీరోలు.. వాళ్ళకి డ్యామేజ్ జరగకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇంత వివాదం జరిగిన తర్వాత చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం పై మీడియా ప్రశ్నించగా దిల్ రాజు స్పందించారు.
చిత్ర పరిశ్రమలో అన్ని నిర్ణయాలు చివరి నిమిషంలోనే జరుగుతాయి. నా సినిమా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా.. పవన్ కళ్యాణ్ గారు ఊరికే అనలేదు.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అని అంటూ దిల్ రాజు పవర్ స్టార్ డైలాగ్ పేల్చారు.
ఇక్కడ ఏం జరిగినా నామీదే పది ఏడుస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక విజయ్ లాంటి మాస్ హీరోతో ఫ్యామిలీ సబ్జెక్టు చేయడం ఏంటి.. మహేష్ బాబుతో, ఎన్టీఆర్ తో కూడా ఫ్యామిలీ చిత్రాలు చేశారు.. ఫ్యామిలీ కథలే ఎందుకు అని ప్రశ్నించగా దిల్ రాజు స్పందించారు.
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఎలాంటి మాస్ హీరోలు.. వాళ్ళు ఫ్యామిలీ కథలు చేయలేదా అని ప్రశ్నించారు. గ్యాంగ్ లీడర్ మూవీ కథ ఏంటి.. ఫ్యామిలీ స్టోరీ కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. వారసుడు కూడా అంతే.. విజయ్ అభిమానులకు కావలసిన అంశాలు అన్ని ఉంటాయి అని అన్నారు.