MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • దిల్ రాజు షాకింగ్ కామెంట్స్: మొహమాటం లేకుండా ఆ హీరోలకు కౌంటర్!

దిల్ రాజు షాకింగ్ కామెంట్స్: మొహమాటం లేకుండా ఆ హీరోలకు కౌంటర్!

చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదనే విమర్శపై దిల్ రాజు స్పందించారు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వర్నీ సపోర్ట్ చేయరని, టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతారని అన్నారు.

3 Min read
Author : Surya Prakash
Published : Nov 09 2024, 07:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dil Raju, Kiran Abbavaram, kA

Dil Raju, Kiran Abbavaram, kA


నిర్మాతగా దిల్ రాజు ఏ స్దాయిలో ఉన్నా గ్రౌండ్ రియాల్టీస్ మాట్లాడటంతో ఎప్పుడూ వెనకాడరు. ఆ మాటలు ఒక్కోసారి వివాదం తెచ్చిపెట్టినా తన పంధాని మార్చుకోరు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు కొంచెం గట్టిగానే మాట్లాడారు.

 చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదనే విమర్శపై డైరక్ట్ గానే స్పందించారు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వర్నీ సపోర్ట్ చేయరని ఓపెన్ గా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం, రాకేష్ వర్రే వంటి హీరోలకు ఆయన చేదు నిజాన్ని చెప్పుకొచ్చారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Dil Raju, Kiran Abbavaram, kA

Dil Raju, Kiran Abbavaram, kA


‘‘మంచి సినిమా చేశామని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విడుదలకు ముందు చాలామంది...పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నవాళ్లే. కానీ మా మాటల్ని ప్రేక్షకులు నమ్మి నిజం చేశార’’న్నారు కిరణ్‌ అబ్బవరం.

 అలాగే రీసెంట్ గా 'జితేందర్ రెడ్డి' మూవీ ఈవెంట్లో హీరో రాకేష్ వర్రే తమలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలు చేసే హీరోల ఈవెంట్లకి సెలబ్రిటీలను తీసుకురావడం చాలా కష్టమైన విషయం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 
 

36


రాకేష్ వర్రే మాట్లాడుతూ "సెలబ్రిటీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ ఉంటేనే అది ఈవెంటా? ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాకు స్టేజ్ మొత్తం సెలబ్రిటీలే ఉన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే.. సెలబ్రిటీలు కేవలం సపోర్ట్ చేస్తారు. సినిమాను జనాల వరకు తీసుకువెళ్లరు. కాబట్టి ఫిలిం మేకర్స్, నటీనటులు అందరికీ చెప్పేదొక్కటే.. మార్కెటింగ్ పై దృష్టి పెట్టండి.

ఇప్పుడు అందరి మైండ్ సెట్ విచిత్రంగా మారిపోయింది. అంటే సెలబ్రిటీ ఉంటేనే అది ఈవెంట్, జనాల్లోకి వెళ్తుంది... అసలు ఈ మైండ్ సెట్ ఏంటి? అసలు నిజంగా ఒక సెలబ్రిటీని తీసుకురావాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? దానికంటే ఆ టైంలో ఒక సినిమాను చేయగలము. సెలబ్రిటీలు పిలిచినా రారు సార్... వాళ్లకు ఇష్టమైతేనే సినిమా ఈవెంట్స్ కి వస్తారు... వాళ్లకి ఫ్రెండ్స్ అయితోనో, లేదా మరేవిధంగా అయినా దగ్గర అయితేనో వస్తారు. ట్రై చేస్తూనే ఉన్నాము.. కానీ ఎవ్వరూ రాలేదు" అన్నారు.
 

46


అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ సెలబ్రిటీలు ఎందుకు వస్తారు? అని తిరిగి ప్రశ్నించారు.  “చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదంటున్నారు కొంతమంది. ఆమధ్య కిరణ్ అబ్బవరం ఆవేదన కూడా ఓ వీడియోలో చూశాను.

ఇక్కడ ఎవరికివారు ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని భయపడకూడదు. టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వడ్నీ సపోర్ట్ చేయరు.” అలాగే ఎమోషనల్ అయితే ఉపయోగం లేదంటున్నారు దిల్ రాజు. సక్సెస్ వచ్చినప్పుడు పెద్దలు కొంతమంది వచ్చి అభినందిస్తారని.. అంతకుమించి ఇండస్ట్రీలో ఎవ్వరూ ఏమీ చేయరని అన్నారు.

56


దిల్ రాజు మాట్లాడుతూ..'నిన్న రాకేష్ ప్రెస్ మీట్ లో సెలబ్రెటీలు రావడం లేదని అంటున్నాడు... రారమ్మా.. ఎందుకు వస్తారు? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్లది. వాళ్ల టైం మీ టైంతో సెట్ అయితే వస్తారు. మీడియాకు ఏంటంటే ఎవరైనా సెలబ్రిటీలు వస్తేనే వాళ్లకు క్లిప్స్ వస్తాయి.

మన బాధ మనది, వాళ్ల బాధ వాళ్లది... అయితే సెలబ్రిటీ వచ్చారా లేదా అన్నది పాయింట్ కాదు... నువ్వు నీ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళ్లావు అనేదే పాయింట్ ఇక్కడ... ఎలాగైనా సరే కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాలి. అంతేగాని అంచనాలు పెట్టుకుని సినిమాలు చేయొద్దు. అప్ కమింగ్ నటీనటులు అందరికీ ఇదే నా సజెషన్" అంటూ చెప్పుకొచ్చారు. 

66


దిల్‌ రాజు కంటిన్యూ చేస్తూ ...‘‘దీపావళికి బాక్సాఫీస్‌ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మళ్లీ వస్తుందో లేదో. ఆ పోటీని తట్టుకుని ‘క’ విజయం సాధించడం మామూలు విషయం కాదు.

సమష్టి కృషి ఫలితమే ఈ విజయం. ఇక్కడ ఎవరూ వెనక్కి లాగరు. అలాగని సహకారం కూడా అందించరు. మన కంటెంట్‌తోనే మనం పేక్షకుల దగ్గరకి వెళ్లాలి. కిరణ్‌ అబ్బవరం చిన్న గ్రామంలో పుట్టి తనని తాను నమ్ముకుని విజయాల్ని అందుకున్నాడ’’అన్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved