- Home
- Entertainment
- బిగ్ అప్డేట్.. ప్రశాంత్ నీల్, దిల్ రాజు భారీ చిత్రం ఖరారు..క్రేజీ టైటిల్, హీరో అతనేనా ?
బిగ్ అప్డేట్.. ప్రశాంత్ నీల్, దిల్ రాజు భారీ చిత్రం ఖరారు..క్రేజీ టైటిల్, హీరో అతనేనా ?
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో దిల్ రాజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వారసుడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా బిగ్ అప్డేట్ అందించారు. తన తదుపరి చిత్రాలని ఖరారు చేశారు. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు తన చిత్రాన్ని ప్రకటించారు.
ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ లో 'రావణం' అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. అత్యంత భారీ బడ్జెట్ లో కళ్ళు చెదిరే విఎఫెక్స్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలిపారు. రావణం చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలో నటీనటుల గురించి, ఇతర వివరాల గురించి తర్వాత చెబుతానని దిల్ రాజు అన్నారు. కానీ క్రేజీ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే రెండవసారి ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక రావణం ఉంటుంది. ఇక దిల్ రాజు మరో రెండు పాన్ ఇండియా చిత్రాలని కూడా ప్రకటించారు.
హిట్ 2 దర్శకుడు శైలేష్ కొలనుతో 'విశ్వబ్రహ్మ' అనే చిత్రం తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటితో 'జటాయు' అనే మూవీ అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.