నాగ్ ఫ్యామిలీతో సమంతకు విభేదాలు... సోషల్ మీడియా పోస్ట్ తో ఒక క్లారిటీ!
కొన్నాళ్లుగా సమంత ప్రవర్తనను ఆధారంగా చేసుకొని కొన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి. సమంతకు నాగ్ ఫ్యామిలీ కి విబేధాలు వచ్చాయని. సమంత వలన ఆ ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తుందని కథనాలు వెలువడుతున్నాయి.
ఏకంగా సమంత, నాగ చైతన్యకు మధ్య పొసగడం లేదని, వీరు విడిపోవాలనే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు కొందరు కథలు అల్లేశారు. కొన్ని మీడియా సంస్థలు పేర్లు ప్రస్తావించకుండా టాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు సిద్ధం అయ్యారంటూ కథనాలు వడ్డించారు.
ఈ ఊహాగానాలకు బీజం పడడానికి కారణం... సమంత ఈ మధ్య తన పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పేరులో ఉన్న అక్కినేని తొలగించడంతో పాటు జస్ట్ ఎస్ అనే అక్షరాన్ని పేరుగా మార్చుకుంది. సమంత తన పేరు నుండి అక్కినేని ఎందుకు తొలగించారు అనే సందేహం అందర్లో మొదలైంది.
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత అక్కినేని కుటుంబంకి చెందిన వ్యక్తిని కావడం వలన రిస్ట్రిక్షన్స్ మధ్య మడిగట్టుకొని ఉండాల్సిన అవసరంలేదని, ఒకింత బోల్డ్, స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. అలాగే చైతు, సమంత కలిసి ఉండడం లేదని, వేరుగా ఉంటున్నారని కూడా తెలుస్తుంది.
పైన అంశాల సమాహారంగా నాగ్ ఫ్యామిలీతో సమంతకు చెడిందని కథనాలు వెలువడ్డాయి. అయితే నిన్న నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె నాగ్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
మీరంటే ఎంతో గౌరవం, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి మీరు మామ.. అంటూ ట్వీట్ చేశారు. సమంత ట్వీట్ నేపథ్యంలో నాగ్ ఫ్యామిలీతో సమంతకు గొడవలు, చైతూతో విడాకులు వంటి వార్తలు అన్నీ అపోహలే అని తేలింది.
అయితే కేవలం బర్త్ డే విషెస్ చెప్పిన కారణంగా సమంత, నాగ్ మధ్య సఖ్యత ఉందని, వారి మధ్య బేధాభిప్రాయాలు లేవని నమ్మడానికి లేదని అంటున్నారు కొందరు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.