MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Dhanush-Aishwarya Divorce: సమంత-నాగచైతన్య, ధనుష్‌-ఐశ్వర్యల విడాకులకు ఉన్న తేడా ఇదే.. హాట్‌ టాపిక్‌

Dhanush-Aishwarya Divorce: సమంత-నాగచైతన్య, ధనుష్‌-ఐశ్వర్యల విడాకులకు ఉన్న తేడా ఇదే.. హాట్‌ టాపిక్‌

స్టార్‌ హీరో ధనుష్‌,  తన భార్య  ఐశ్వర్య రజనీకాంత్‌ విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. అటు రజనీ అభిమానులకు, ఇటు ధనుష్‌ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 18 2022, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ధనుష్‌, ఐశ్వర్య  రజనీకాంత్‌ విడాకులు ప్రకటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ధనుష్‌ విడాకులు  తీసుకోవడానికి కారణమేంటనేది ఇప్పుడు అందరికి షాక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట డైవర్స్ ప్రకటన  అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 18ఏళ్ల క్రితం  ధనుష్‌, ఐశ్వర్య  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాటిక్‌గా వీరి లవ్‌ స్టోరీ సాగింది. పెద్దల  అంగీకారంతో 2004లో ఒక్కటయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం  జరిగింది. అప్పటికి ధనుష్‌ వయసు  21ఏళ్లు మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. ప్రేమకి వయసుతో సంబంధం లేదని నిరూపించుకున్నారు. ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ప్రేమకి గుర్తుగా ఇద్దరు కుమారులు యాత్ర రాజా, లింగ రాజా జన్మించారు. ప్రస్తుతం యాత్ర రాజా వయసు 15 సంవత్సరాలు కాగా, లింగ రాజా వయసు 11 సంవత్సరాలు. ఇలాంటి  టైమ్‌లో వీరిద్దరు డైవర్స్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

38

ధనుష్‌ విడాకులకు సంబంధం ఏంటనేది ఇప్పుడు  ఆసక్తికరంగా సస్పెన్స్ గా మారింది. అయితే తాజాగా ఓ రూమర్‌ నెట్టంట  వైరల్‌ అవుతుంది. వీరి విడాకులకు కారణంగా సింగర్‌ సుచిత్ర  గతంలో ట్విట్టర్‌ ద్వారా  పంచుకున్న వీడియో అని తెలుస్తుంది. హీరో ధనుష్ తమన్నా, పూనమ్ భజ్వాలతో కలిసి మద్యం తాగుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో కూడా సుచిత్ర కార్తిక్ ట్విట్టర్ అకౌంట్ నుంచే లీకైంది. అయితే, ఆ లీకులకు, తనకు ఎటువంటి సమాధానం లేదని ఆమె చెప్పింది. వాటి ప్రభావం కూడా ఈ విడాకులకు ఓ కారణం అంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. దీనిపై స్పష్టత  రావాల్సి ఉంది. అసలు కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. 

48

ఇదిలా ఉంటే ఇటీవల  కాలంలో సినీ సెలబ్రిటీల విడాకుల ప్రకటన అందరిని  షాక్‌కి గురి చేస్తుంది. అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావులు కూడా విడిపోయారు. వీరితోపాటు టాలీవుడ్‌ కపుల్ సమంత,  నాగచైతన్య సైతం విడిపోయిన విషయం తెలిసిందే.  ఇద్దరు ఒకేసారి అక్టోబర్‌ 2న సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో తామిద్దరం దూరంగా ఉండాలని,  తమ దారులు వేరని, విడిపోయినా తమ మధ్య  ఫ్రెండిషిప్‌ కొనసాగుతుందన్నారు. 

58

అయితే సమంత,  నాగచైతన్య విడిపోవడానికి మూడు,  నాలుగు నెలల ముందు నుంచి రూమర్స్ వినిపించాయి.  వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు  కొట్టాయి. సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని పేరుని తొలగించడంతో విడిపోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అంతా ఊహించినట్టుగానే సమంత,  నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులను, సినీ వర్గాలకు ఈ వార్త పెద్దగా షాకింగ్‌గా అనిపించలేదు. 
 

68

కానీ ధనుష్‌, ఐశ్వర్యల విషయం అలా కాదు. ఒకేసారి వీరిద్దరు షాకిచ్చారు. వీరిద్దరి ఎలాంటి గొడవలకు సంబంధించిన వార్తలు  కూడా బయటకు రాలేదు. ఎలాంటి రూమర్స్ లేవు. దీంతో అంతా షాక్‌ అవుతున్నారు. ఇది రజనీకాంత్‌కి కూడా  షాకింగ్‌ విషయమే  అంటున్నారు. ఏదేమైనా ఇలా వరుసగా  సినీ సెలబ్రిటీలు, స్టార్స్  స్థాయి  యాక్టర్స్ డైవర్స్ ప్రకటన అభిమానులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందని చెప్పొచ్చు. 

78

ధనుష్‌..  ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `సార్‌` అనే  సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ధనుష్‌. ఇవే కాకుండా ఆయన `మారన్‌`, `థిరుచిత్రంబలం`, `నాన వరువెన్‌`,  `వాతి` చిత్రాల్లో నటిస్తున్నారు.  దీంతోపాటు `ది గ్రే మ్యాన్‌` అనే హాలీవుడ్‌ చిత్రం   చేస్తున్నారు ధనుష్‌. 

88

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురైన ఐశ్వర్య రజనీకాంత్‌  అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.  ఆమె 2012లో ధనుష్‌ హీరోగా `3` మూవీతో దర్శకురాలిగా మారింది. ఈ సినిమా సక్సెస్‌ కాలేకపోయినా ఇందులోని `కొలవెరి` సాంగ్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. దీంతోపాటు `వెయ  రాజా వెయ్‌`, `సినిమా వీరన్‌` చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరోవైపు `విజిల్‌` అనే చిత్రంలో `నాట్‌పాయి  నాట్‌పాయి`, `అయిరాతి ఓరువన్‌` చిత్రంలో  `అన్‌ మేలా  ఆసధన్‌` పాట ఆలపించారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved