హీరోయిన్‌తో ఒకరాత్రి గడిపాడంటూ వార్తలు.. అరెస్ట్‌ అయిన షారూఖ్‌

First Published 22, May 2020, 12:24 PM

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన కార్యకలాపాలు ఏమీ లేకపోవటంతో సినీ అభిమానులు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్‌ ఖాన్‌. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని కింగ్ ఖాన్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో ఓ గొడవ కారణంగా అరెస్ట్ అయ్యాడు.

షారూఖ్‌ ఖాన్ తన కోపం కారణంగా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు గతంలో చాలా సార్లు విన్నాం. వాంఖడే స్టేడియంలో సల్మాన్‌తో షారూఖ్‌ గొడవ పడటం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. అలాగే 1992లోనూ తన టెంపర్మెంట్ కారణంగా షారూఖ్‌  చిక్కుల్లో పడ్డాడు.

90లలో బాలీవుడ్‌ న్యూ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు బాద్‌ షా. కేవలం షారూఖ్‌ పేరు మీద సినిమా బ్లాక్ బస్టర్ స్థాయికి చేరే రేంజ్‌లో ఇమేజ్ సాధించాడు. అదే సమయంలో సినీ బ్లిట్జ్ అనే ఓ మ్యాగజైన్‌ కు చెందిన ఓ జర్నలిస్ట్‌తో షారూఖ్‌కు తరుచూ వివాదం జరుగుతుండేది.

ప్రస్తుతం చర్చిస్తున్న సంఘటన `కింగ్ ఆఫ్‌ బాలీవుడ్‌: షారూఖ్‌ ఖాన్‌ అండ్ ద సెడక్టివ్‌ వరల్డ్‌ ఆఫ్‌ ఇండియన్ సినిమా`. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం మాయ మేం సాబ్‌ సినిమాలో దీపా సాహితో ఓ ఇంటిమేట్‌ సీన్‌లో నటించాడు షారూఖ్‌ ఖాన్‌.

ఆ సినిమా షూటింగ్ సమయంలో సినీ బ్లిట్జ్‌ మ్యాగజైన్‌లో చిత్ర దర్శకుడు కేతన్ మెహతాను ఇబ్బంది పెట్టేలా ఓ కథనం ప్రచురితమైంది. ఇంటిమేట్‌ సీన్‌ షూటింగ్‌కు ముందు రోజు దర్శకుడు షారూఖ్‌, దీపాలను ఒకరాత్రి కలిసి గడపాలని సూచించాడట. అలా గడిపితే తెల్లారి షూటింగ్‌లో ఇద్దరు కఫర్టబుల్‌గా ఫీల్ అవుతారని సూచించాడట.

షూటింగ్ సమయంలో కేవలం దర్శకుడు కేతన్ మెహతా సినిమాటోగ్రాఫర్‌లు మాత్రమే ఉండి ఆ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టుగా సదురు వార్త సంస్థ వార్తను ప్రచురించింది. అయితే ఆ ఆర్టికల్‌కు బై లైన్‌ కూడా లేకుండా ప్రచురించటంతో అది కవర్‌ చేసిన జర్నలిస్ట్ ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియదు.

వార్త మీడియాలో వచ్చిన తరువాత... సినీ బ్లిట్జ్‌ జర్నలిస్ట్‌ కేత్‌ డికోస్టాను ఓ ఫిలిం ఈవెంట్‌లో షారూక్‌కు ఎదురుపడటంతో అతని తీవ్ర పదజాలంతో దూషించాడు.

అంతేకాదు మరుసటి రోజు ఆ జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యుల ముందే అతడి మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంతో పాటు బెదిరింపులకు దిగాడు.

దీంతో సదరు జర్నలిస్ట్ కేత్‌, పత్రిక ఎడిటర్‌ సలహాతో షారూఖ్‌ తనపై దాడికి యత్నించాడంటూ తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో షారూఖ్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. వెంటనే ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్న షారూఖ్‌ను అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

అప్పటికే షారూఖ్ టాప్‌ హీరో కావటంతో ఆయన్ను జైలుకు తరలించలేదు. పలువురు పోలీస్‌ అధికారులు ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఈ విషయం గురించి స్పందించిన కేత్ డికోస్టా పోలీసుల ముందే షారూఖ్‌ తనను బెందించాడంటూ ఆరోపించాడు. అయితే అదే రోజు రాత్రి చిక్కీ పాండే షారూఖ్‌కు బెయిల్ ఇవ్వటంతో ఆయన్ను వదిలిపెట్టారు.

ఈ సంఘటనపై రెండేళ్ల తరువాత ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించిన షారూఖ్‌ ఆ జర్నలిస్ట్‌కు క్షమాపణలు తెలిపాడు. నేను భావించినట్టుగా ఆ వార్త డికోస్టా రాయలేదని మరో జర్నలిస్ట్ రాశాడని షారూఖ్ వెల్లడించాడు.

అయితే ఇంత వివాదానికి కారణం అయిన మాయా మీమ్‌ సాబ్ సినిమాలోని సన్నివేశంలో సెన్సార్ కట్‌ కు గురైంది. సినిమాలో ఆ సీన్‌ను పూర్తిగా తొలగించారు. కానీ 2008లో ఆ సీన్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది.

loader