MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

`కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

Khaleja-karthikeya: ఇటీవల `తండేల్‌`తో హిట్‌ అందుకున్న చందూ మొండేటి `కార్తికేయ` సినిమాలకు సంబంధించి ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు. ఇవి `ఖలేజా` నుంచి తీసుకున్నానని చెప్పి షాకిచ్చారు.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 22 2025, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
khaleja, karthikeya

khaleja, karthikeya

Khaleja-karthikeya: నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన `కార్తికేయ` సినిమా అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. థ్రిల్లర్‌, మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీతో నిఖిల్‌ సక్సెస్‌ కొట్టాడు. అంతకు ముందు ఆయన వరుస పరాజయాల్లో ఉండగా, ఈ మూవీ కమ్‌ బ్యాక్‌ అయ్యేలా చేసింది. హీరోగా పుంజుకునేలా చేసింది. ఈ మూవీ హిట్‌ కావడంతో మూడేళ్ల క్రితం దీనికి సీక్వెల్‌ని తీసుకొచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Karthikeya

Karthikeya

ఈ మూవీ ఇండియా వైడ్‌గా పెద్ద హిట్‌ అయ్యింది. వంద కోట్లు వసూలు చేసింది. నిఖిల్‌కి పాన్‌ ఇండియా ఇమేజ్‌ తీసుకొచ్చింది. కృష్ణుడి తత్వం ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు చందూ మొండేటి.

అయితే ఈ రెండు సినిమాల్లో అసలు పాయింట్‌ కాపీనే అట. అది మహేష్‌ బాబు సినిమా `ఖలేజా` నుంచి కాపీ కొట్టినట్టు తెలిపారు చందూ మొండేటి. తాజాగా ఆయన షాకింగ్‌ నిజాలను బయటపెట్టాడు. 

36
Thandel Movie

Thandel Movie

చందూ మొండేటి ఇటీవల `తండేల్‌` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. మత్స్యకారుల జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

నాగచైతన్యకి కెరీర్‌ బెస్ట్ హిట్‌ ని అందించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలిచ్చాడు చందూ మొండేటి. ఇందులో `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ అనే విషయాన్ని వెల్లడించారు. 
 

46
ఖలేజా

ఖలేజా

అయితే ఆ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ తన భార్య పట్టేసింది. `కార్తికేయ` సినిమాలు చూసినా ఆమె ఆ తర్వాత ఇటీవల టీవీలో `ఖలేజా` సినిమా చూసినప్పుడు కొన్ని సీన్లు చూసి `ఏ దొంగ ఇది లేపేశావ్‌ కదా` అంటూ కనిపెట్టిందట. అయితే ఈ ఇంటర్వ్యూలో చందూ మొండేటి చెబుతూ, తాను `ఖలేజా` నుంచి ఇన్‌స్పైర్‌ అయినట్టు చెప్పారు.

ఈ విషయం `కార్తికేయ` విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌ కి కూడా చెప్పారట. `ఖలేజా` ఇన్‌స్పిరేషన్‌తోనే `కార్తికేయ` తీశానని, ఇప్పుడు `కార్తికేయ 2` తీస్తున్నానని తెలిపాడట. అందుకు ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అయినట్టు తెలిపారు చందూ మొండేటి. మళ్లీ మనం కలుద్దామని త్రివిక్రమ్‌ కూడా అన్నారని, కానీ ఆ తర్వాత కలవడం కుదరలేదని తెలిపారు చందూ. 

56
Karthikeya 2

Karthikeya 2

చందూ మొండేటి కాపీ(ఇన్‌స్పైర్‌) కొట్టిన సీన్లు ఏంటంటే.. `ఖలేజా`లో మహేష్‌ బాబు ముందుగానే ఏం జరగబోతుందో ప్రిడిక్ట్ చేస్తాడు, అదే సీన్‌ `కార్తికేయ`లోనూ ఉంటుంది. కానీ `ఖలేజా`లో ఆ ప్రిడిక్షన్‌ వర్కౌట్‌ కాలేదని, కానీ తన సినిమాలో అయ్యిందని తెలిపారు.

`ఖలేజా`లో హీరోహీరోయిన్‌ కలిసినప్పుడు ఏదో ఒక డిజాస్టర్‌(యాక్సిడెంట్‌) జరుగుతుంటుంది, తన సినిమాలో పాజిటివ్‌ జరుగుతుందని, వాటిని అలా మార్చారట చందూ మొండేటి. అందులో అనుకోకుండా హీరో ఓ ఊరు వెళ్తాడు, అక్కడ మెడికల్‌ క్యాంప్‌ పెడతాడు, ఇందులోనూ సేమ్‌ మెడికల్‌ క్యాంప్ ఉంటుంది.

మహేష్‌ బాబు ఓ సీన్‌లో దేవుడి డెఫినేషన్‌ అర్థం అయ్యిందంటాడు, అక్కడ దైవం మానుష్య రుపేణా అని చెప్పినట్టే, `కార్తికేయ 2` టైటిల్‌ గ్లింప్స్ లో అదే లైన్‌ పడుతుందని, తన సినిమా స్క్రీన్‌ ప్లే మొత్తం ఆ పాయింట్‌ చుట్టూనే తిరుగుతుందన్నారు. 

66
chandoo mondeti

chandoo mondeti

మొత్తంగా త్రివిక్రమ్‌ సినిమాలో చెప్పినట్టు `ఖలేజా` సినిమా ఇన్‌స్పిరేషన్‌తోనే తాను రెండు సినిమాలు చేశానని, అంతేకాదు దీన్నొక ఫ్రాంఛైజీగా చేయడానికి ఒక సోల్‌ దొరికిందన్నారు చందూ మొండేటి. అయితే మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `ఖలేజా` అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ దాన్నుంచి ఇన్ స్పైర్‌ అయి చేసిన `కార్తికేయ`, `కార్తికేయ 2` చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ కావడం విశేషం.

సీన్లని ఇన్‌స్పైర్‌ అయి తనకు తగ్గట్టుగా మార్చుకుని రాసుకున్నారు చందూ. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఇది నీ రేంజ్‌ అని ఆయన్ని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం చందూ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

read  more: మేకప్‌ లేకుండా అనసూయ డేర్‌.. ఒరిజినల్‌ లుక్‌పై నెటిజన్లు క్రేజీ రియాక్షన్‌.. చివరికి ఈ పరిస్థితేంటి?

also read: ప్రదీప్‌ రంగనాథన్‌ `డ్రాగన్` బాక్సాఫీస్ కలెక్షన్లు.. తొలిరోజు ఎంత వచ్చాయంటే?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved