- Home
- Entertainment
- అందరు కలిసే సుడిగాలి సుధీర్‌ని పంపించారా? బాంబ్ పేల్చిన `జబర్దస్త్` కమెడియన్.. హాట్ టాపిక్
అందరు కలిసే సుడిగాలి సుధీర్‌ని పంపించారా? బాంబ్ పేల్చిన `జబర్దస్త్` కమెడియన్.. హాట్ టాపిక్
సుడిగాలి సుధీర్ `జబర్దస్త్`ని వీడటం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన ఎందుకు వెళ్లారనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా బుల్లెట్ భాస్కర్ బాంబ్ పేల్చాడు.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) స్కిట్లు `ఎక్స్ ట్రా జబర్దస్త్`(Extra Jabardasth) లో ఎంతగా పేలుతుంటాయో తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో, తనపై పంచ్‌లు వేయించుకుంటూ నవ్వులు పూయిస్తుంటాడు సుధీర్. మరోవైపు రష్మి(rashmi Gautam)తో కలిసి ఆయన చేసే రచ్చ మరో స్థాయిలోఉంటుంది. ఇద్దరూ లవర్స్ అనే రేంజ్‌లో కలరింగ్ ఇస్తూ షోకి హైప్ తీసుకొస్తుంటారు.
దాదాపు తొమ్మిదేళ్లు జబర్దస్త్ లో చేసిన సుధీర్ ఇటీవల అనూహ్యంగా షోని వీడారు. నిర్వహకుల ఒత్తిడి మేరకు ఆయన వైదొలిగినట్టు ప్రచారం జరగ్గా, మరో షోలో ఆఫర్ రావడంతో తప్పుకున్నట్టు మరికొన్ని వార్తలొచ్చాయి. దీనికితోడు హీరోగా సినిమా అవకాశాలు వస్తోన్న నేపథ్యంలో `జబర్దస్త్` నుంచి తప్పుకున్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఏదేమైనా అసలు విషయం మాత్రం సుధీర్ వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ ఎందుకెళ్లిపోయాడు అసలు విషయం బయటపెట్టాడు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar). ఒక్కసారిగా బాంబ్ పేల్చాడు. అంతేకాదు సుధీర్‌కి సంబంధించిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో గణేష్ పండుగని అంతా సెలబ్రేట్ చేశారు. అనంతరం రాజ్యానికి సంబంధించిన స్కిట్ చేశారు. ఇందులో ఫైమా, భాస్కర్ కలిసి రాజు, రాణిలుగా చేశారు. ఫైమా చెబుతూ, పక్క రాజ్యం వారు మనపై దండెత్తి వస్తారు కదా, మీరు పారిపోవడానికి ఓ సొరంగం తవ్వండి అంటూ రాజైన భాస్కర్‌కి చెబుతుంది.
ఆమె మాటలకు చిర్రెత్తిపోయిన భాస్కర్ అసలు విషయం బయటపెట్టాడు. సొరంగం.. సొరంగం అంటూ ఒక్కడిని ఎంకరేజ్ చేశారు. వాడేం చేశాడు.. ఆ సొరంగంలో నుంచి పక్క రాజ్యానికి వెళ్లాడంటూ సెటైర్లు పేల్చాడు. ఆవేశంలో చెప్పినా, అందరు కలిసి ఆయన్ని ఎంకరేజ్ చేశారని, అందరు కలిసే అతన్ని పంపించారనే విషయాన్ని వెల్లడిస్తూ పెద్ద బాంబ్ పేల్చాడు భాస్కర్. దీంతో షోలో నవ్వులు విరిసాయి.
ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది.ఇందులో వర్షని ఇమ్మాన్యుయెల్ వదిలేయడం, కేతిక శర్మ ఇకపై తన మనసులో ఉంటుందని చెప్పడం, వైష్ణవ్ తేజ్ వర్షకి కమిట్ కావడం నవ్వులు పూయిస్తుంది. ఇది శుక్రవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే.