- Home
- Entertainment
- అంతఃపుర మహారాణిలా ‘ఢీ’ బ్యూటీ ఆహార్యం.. పట్టుచీరలో మెరిసిపోతున్న నటి పూర్ణ.. పిక్స్ వైరల్
అంతఃపుర మహారాణిలా ‘ఢీ’ బ్యూటీ ఆహార్యం.. పట్టుచీరలో మెరిసిపోతున్న నటి పూర్ణ.. పిక్స్ వైరల్
ఢీ బ్యూటీ, నటి పూర్ణ (Poorna) సంప్రదాయ దుస్తుల్లో అంతఃపుర మహారాణిలా కనిపిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో యువరాణిలా పోజులిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమె తాజా ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కేరళ బ్యూటీ, నటి పూర్ణ (Poorna) వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు టెలివిజన్ షోలలోనూ మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మహారాణిలా దర్శనమిచ్చింది.
తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ పూర్ణ దగ్గరగానే ఉంటుంది. తాజా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుతో ఖుషీ చేస్తుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ నెట్టింట అడుగుపెట్టిందంటే ట్రెడిషనల్ వైబ్స్ రావాల్సిందే.
ఎక్కువగా పూర్ణ అచ్చమైన తెలుగమ్మాయిలా.. నిండు వస్త్రాల్లోనే కనిపించేందుకు ఇష్టపడుతుంటుంది. అలాగే పూర్ణ ఫ్యాన్స్ కూడా ఆమెను ట్రెడిషనల్ లుక్ లోనే చూడాలని కోరుకుంటుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పూర్ణ ఫొటోషూట్లు చేస్తుంటుంది.
తాజాగా పూర్ణ చేసిన ఫొటోషూట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. క్రీమ్ కలర్ పట్టుశారీలో అంతఃపుర మహారాణిలా పూర్ణ ఆహార్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాణిలాగే స్టిల్స్ ఇవ్వడం ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. ఇలా అదిరిపోయే దుస్తుల్లో కనువిందు చేస్తోంది.
గ్లామర్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ బ్యూటీ ఇటీవల తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. ఇటు ‘ఢీ’షో జడ్జీగానూ టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది.
తెలుగులో ‘అవును’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ. రీసెంట్ గా ‘అఖండ’తో మంచి సక్సెస్ ను అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిగ్ స్క్రీన్ పై తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘దసరా, బ్యాక్ డోర్’, ‘వృత్తం’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.