MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhanya Balakrishna : 12 ఏళ్లకు తప్పును సరిదిద్దుకున్న నటి ధన్య బాలకృష్ణ... వారికి క్షమాపణలు!

Dhanya Balakrishna : 12 ఏళ్లకు తప్పును సరిదిద్దుకున్న నటి ధన్య బాలకృష్ణ... వారికి క్షమాపణలు!

నటి ధన్య బాలకృష్ణ Dhanya Balakrishna 12 ఏళ్ల తర్వాత తను చేసిన తప్పును సరిదిద్దుకుంది. ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ గ్గా మారింది. 

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 02 2024, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి ధన్య బాలకృష్ణ కొన్నేళ్లుగా టాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. హీరోయిన్ గా,  సపోర్టింగ్ రోల్స్ తో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తూ వస్తోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో చివరిగా ‘రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్’ చిత్రంలో హీరోయిన్ గా అలరించింది. రీసెంట్ గానే ఆ సినిమా విడుదలైంది. నెక్ట్స్ కోలీవుడ్ చిత్రం ‘లాల్ సలామ్’ తో ప్రేక్షకులను అలరించనుంది. నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. 
 

36

‘లాల్ సలామ్’ చిత్రాన్ని నటుడు రజనీకాంత్‌ కథానాయకుడిగా, ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ తో పాటు నటి ధన్య బాలకృష్ణ కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే తమిళంలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుండటంతో ధన్యకు సంబంధించిన పాత గొడవను తమిళ ఆడియెన్స్ బయటికి తీశారు. 

46

తమిళ ప్రేక్షకులను కించపరుస్తూ 2012లో చేసిన పోస్టును ఎత్తిచూపుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ధన్య స్పందించింది. బెంగళూరు కు చెందిన ధన్య గతంలో... ‘ప్రియమైన చెన్నై, మీరు అడిగితే నీళ్లు ఇచ్చాం. కరెంట్ ఇచ్చాం. అయినా మా నగరాన్ని కూడా ఆక్రమించారు. క్షమాపణలు చెబితేనే ప్లే ఆఫ్స్ కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేమిస్తాం’.. అంటూ గతంలో పోస్ట్ చేసింది. 

56

ఇదే విషయాన్ని తమిళ తంబీలు గుర్తులు చేయడంతో ఇప్పుడు ఇలా స్పందించింది. ‘నా ప్రొఫెషన్, తినే తిండి మీద ఒట్టు వేసి చెబుతున్నాను. అది నా అభిప్రాయం కాదు. 12 ఏళ్ల కిందటి ఆ పోస్ట్ లోని కామెంట్స్ నావి కావు. ట్రోల్స్ కోసమే క్రియేట్ చేసింది. ఇన్నేళ్లు స్పందించలేదు. 

66

అప్పుడు నా కుటుంబానికి చాలా బెదిరింపులు వచ్చాయి. వాళ్లను కాపాడుకునేందుకు మౌనంగా ఉన్నాను.. కానీ ఇప్పుడు పక్కాగా చెబుతున్నాను. అవి నా కామెంట్స్ కాదు. నా కెరీర్ తమిళ పరిశ్రమలోనే మొదలైంది. అక్కడ పనిచేయడం గౌరవంగా ఉంటుంది. ఆ స్టేట్ మెంట్ తో నాకెలాంటి సంబంధం లేదు.’

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Kalki 2 Release Date: కల్కి 2 రిలీజ్‌ అయ్యేది అప్పుడే, ఏడాదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌
Recommended image2
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved