బయటపడ్డ శ్రీలీల నిజ స్వరూపం, స్వయంగా దొరికిపోయిన థమాకా హీరోయిన్
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ శ్రీలీల ఒరిజినల్ బిహేవియర్ బయటపడింది. ఆమె ఎలా ఉంటుంది. ఎప్పుడు టెంపర్ అవుతుంది. కోపం వస్తే ఏం చేస్తుందిలాంటి విషయాలు తానే స్వయంగా బయటపెట్టేసింది.

ధమాకా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది శ్రీలీల. ఫెయిల్యూర్ తో స్టార్ట్ చేసి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరో యిన్ గా మారిపోయింది. ఇక ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమె పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.
అయితే బయటకు కనిపించే శ్రీలీల వేరు.. లోప శ్రీలీల వేరు.. ఈ విషయాన్ని ఈమెస్వయంగా వెల్లడించింది. కూల్ గా కనిపించే తనలో ఓ కోపిస్టి దాగి ఉంది అంటోంది ఆమె. తనకు కోపం వస్తే ఎదుటివారు ఎవరైనా అయిపోవల్సిందే అంటోంది.. పెళ్ళి సందడి బ్యూటి. తన గురించ నాలు షాకింగ్ విషయాలు వెల్లడించింది.
రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. చాలా క్యూట్ గా..సరదాగా.. కూల్ కనిపించే శ్రీ లీల కోపం వస్తే మాత్రం... అపరిచితురాలు అయిపోతుందట. అప్పటి వరకూ కూల్ గా ఉన్నా... ఏ మూడ్ లో ఉన్నా.. కోపం వస్తే మాత్రం అంతే సంగతులంటోంది.
ముఖ్యంగా తనని విసిగించే మాటలు మాట్లాడితే మాత్రం తనకి వెంటనే కోపం వస్తుందట. ఆ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఫైర్ అయిపోతానని చెప్పుకొచ్చింది. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తానని.. ఆ టైంలో అమ్మ ఉన్నా ఎవరున్నా సరే.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తానని అంటోంది బ్యూటీ.
అయితే ఇక్కడే చిన్న ట్వీస్ట్ ఉంది. ఆమెకు కోపంఎంత త్వరగా వస్తుందో.. అంతే త్వరగా చల్లారి. కోపం పోగానే తర్వాత తిట్టేశాను అని బాధపడి ఏడుస్తానని చెప్పుకొచ్చింది . అంతేకాదు అమ్మ కాబట్టి నా కోపాన్ని భరిస్తుంది మిగతా వారు ఎవరైనా సరే దెబ్బకు పారిపోతారు అంటూ తన ఒరిజినల్ బిహేవియర్ ను బయట పెట్టేసింది శ్రీలీల.
దీంతో ఈ యంగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లి సందడి తరువాత వరుస ఆఫర్లు కొట్టేస్తున్న శ్రీలీల.. ధమాకాతో మరిన్ని అవకాశాలు కొట్టేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే స్టార్ హీరోలు కూడా శ్రీలీల హీరోయిన్ గా కావాలి అని అడుగుతుండటంతో.. ఆమె డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దాంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట.
ఈసారి ఇంకా పెంచుతుందని అనుకుంటున్నారు. మహేష్ బాబు .. త్రివిక్రమ్ సినిమా కు కూడా మూడు కోట్లు డిమాండ్ చేయడంతో.. ఆమెను పక్కన పెట్టేశారు అని టాక్ వినిపిస్తుంది. మరో వైపు శ్రీలీలకు హెడ్ వెయిట్ పెరిగిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి ఆమె లైఫ్ ను ఎలా డిజైన్ చేసుకుంటుందో.