- Home
- Entertainment
- `ప్రేమ పెద్ద అబద్దం`.. వైరల్ అవుతున్న దీప్తి సునైనా ఇన్‌స్టా పోస్ట్.. టార్గెట్ మాజీ ప్రియుడు షణ్ముఖ్?
`ప్రేమ పెద్ద అబద్దం`.. వైరల్ అవుతున్న దీప్తి సునైనా ఇన్‌స్టా పోస్ట్.. టార్గెట్ మాజీ ప్రియుడు షణ్ముఖ్?
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా హాట్ అందాలతో నెటిజన్లకి గ్లామర్ ట్రీట్‌తో బిజీగా ఉంటుంది. అయితే ఆమె ప్రేమపై పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోసారి ఆమె లవ్ స్టోరీ హాట్ టాపిక్ అవుతుంది.

బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది దీప్తి సునైనా(Deepthi Sunaina). యూట్యూబ్ లో వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్ చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న దీప్తికి బిగ్ బాస్ షో మరింత హైప్‌ని, క్రేజ్‌ని తీసుకొచ్చింది. దీంతో ఓ వైపు టీవీ షోస్, మరోవైపు తన టీమ్‌తో కలిసి వీడియోలు చేసుకుంటూ బిజీగా ఉంది.
ఇక నిత్యం తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది దీప్తి. హాట్ హాట్ పోజులతో ఆమె దిగే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ అలరిస్తుంది. తనకు ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో 3.8 మిలియన్స్ (38లక్షల) మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది దీప్తి.
మరోవైపు ఇన్‌స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల విడుదలైన `విరాటపర్వం` చిత్రంలోని ఓ డైలాగ్ వీడియోని పంచుకుంది. అందులో తాను ఎంతగానో ప్రేమిస్తున్న రవన్న(రానా)ని కలిసేందుకు వెన్నెల(సాయిపల్లవి) ఆరాటపడుతున్న సన్నివేశం అది. ఇందులో ఉద్యమ నాయకుడు(వీరశంకర్) ఆమెకి ప్రేమగురించి చెబుతుంటాడు. ఇక్కడ ఎవరిని ఎవరు ప్రేమించరని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమని, ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబద్దం అని చెబుతాడు. దీప్తి ఈ పోస్ట్ పెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.
దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) ప్రేమించుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో రాణించే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఘాటు ప్రేమలో మునిగి తేలారు. కానీ గతేడాది బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షణ్ముఖ్ పార్టిసిపేట్ చేశారు. అందులో సిరితో ఆయన మూవ్ అయిన విధానంపై అనేక రకాల కామెంట్లు వచ్చాయి. హౌజ్‌లోనూ వీరిద్దరి వ్యవహారం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ఆ షో పూర్తయిన తర్వాత రన్నరప్‌గా బయటకు వచ్చిన షణ్ముఖ్‌కి పెద్ద షాకిచ్చింది దీప్తి సునైనా. ఆయనతో ప్రేమకి బ్రేకప్ చెప్పింది. దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపింది. దీప్తి నిర్ణయాన్ని స్వాగతిస్తూ షణ్ముఖ్ కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఆ ప్రేమని మర్చిపోయేందుకు చాలా కష్డపడింది దీప్తి. వరుసగా అనేక పోస్ట్ లు పెట్టింది. ఇప్పుడు అన్నీ మర్చిపోయి తన కెరీర్ పై ఫోకస్ పెట్టిందని అంతా భావించారు. కానీ లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్ట్ షాకిస్తుంది.
అయితే అది షణ్ముఖ్‌ని ఉద్దేశించే పెట్టి ఉంటుందని, టార్గెట్ షణ్ముఖే అని అంటున్నారు నెటిజన్లు. షణ్ముఖ్ విషయంలో దీప్తి ఫీలింగ్ ఇదే అని, అందుకే ఆ పోస్ట్ పెట్టిందంటున్నారు. అదే సమయంలో ఇన్నాళ్లైనా ఆయన్ని మర్చిపోలేకపోతుందా? అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండటం గమనార్హం. మరి దీప్తి ఏ ఉద్దేశ్యంతో పెట్టిందో ఏమోగానీ, నెటిజన్లు మాత్రం షణ్ముఖ్‌కి ముడిపెడుతూ రచ్చ చేస్తున్నారు.