రణ్ వీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన దీపికా... మనసు విప్పి మాట్లాడేది ఆహీరోతోనే అంటోన్న బాలీవుడ్ బ్యూటీ..
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఒక్కరితోనే తాను మనసు విప్పి మాట్లాడుతాను అంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. ఇంతకీ ఎవారా హీరో..? దీపికా కామెంట్లు ఎవరి గురించి..?
Deepika padukone
ఇండస్ట్రీలో తన ప్రయాణం, తను బాగా నమ్మే వ్యక్తులు.. సంపాదన, పొదుపు.. ఇలా చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. నా బ్యాంకు ఖాతాలోని ప్రతి రూపాయీ నా కష్టార్జితం. నా చెమట ఫలం. దాన్ని పాపాయిలా పెంచాలని ఆరాటపడతాను అన్నారు దీపికా పదుకునే.
నేను ఇప్పుడు నటిని కాని.. పుట్టుకతో నేను ప్లేయర్ ను. అందుకే జీవితాన్ని కూడా ఆటలాగేచూస్తాను. ఈ ప్రపంచాన్ని ప్లై గ్రౌండ్ గా భావిస్తాను అన్నారు దీపికా. అయితే ఇక్కడ ఓటమిని కూడా క్రీడాకారులు హుందాగా చతీసుకుంటారు.. ఆ విషయంలో నేను కూడా అదు ఫార్ములనాను ఫాలో అవుతాను సినిమా బాగా ఆడిన ప్రతిసారీ కప్పు గెలుచుకున్న ఆనందం. ఓటమిని కూడా ఓ క్రీడాకారిణిగా హుందాగానే స్వీకరిస్తాను.
Image: Getty
అంతే కాదు ఏదైనా సరే.. ఆటమైదానం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ.. నా కంటే బాగా నటించేవాళ్లు చాలామందే ఉండవచ్చు. కానీ, డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతే. ఆ ఆత్మవిశ్వాసం గుండెల నిండా ఉంది అన్నారుదీపికా. అంతే కాదు తను ఫ్యామిలీ విషయంలో, సినిమాల విషపయంలో ఎలా ఉంటాను అనేది క్లారిటీ ఇచ్చారు దీపికా.
Ranveer Singh Deepika Padukone
వృత్తి జీవితం, ఫ్యామిలీ లైఫ్ ను వేరు వేరుగా చూస్తుందట దీపికా పదుకునే. సర్సనల్ లైఫ్ వేరు.. ఫ్యామిలీ లైఫ్ వేరు అంటోంది. తాను సినిమా సెట్ లో ఉండగా.. ఫ్యామిలీ విషయాలు మాట్లాడదట, ఇక సినిమా విషయాలు ఇంట్లో డైనింగ్ టేబుల్ వరకూ రావు అంటోంది. అయితే ఒక్క తన భర్త రణ్ వీర్ తో మాత్రం సినిమా విషయాలు పంచుకుంటాను అంటోంది దీపికా.
అయితే రణ్ వీర్ సినిమాకు బంధించిన వ్యాక్తి కాకుంటే.. అతనితో కూడా ఈ విషయాలు డిస్కర్స్ చేసేదానిని కాదు అంటోంది దీపికా. ఇక మరో షాకింగ్ అప్ డేట్ ఇచ్చింది దీపికా. తాను బాలీవుడ్‌లో మనసు విప్పి మాట్లాడుకునేంత చనువు ఒక్క షారుక్‌ఖాన్ దగ్గర మాత్రమే ఉంది అంటోంది. మరి రణ్ వీర్ తో మాట్లాడవా అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఫ్యాషన్స్ విషయంలో నాకంటూ కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందంగా అలంకరించుకోవడం నాకు ఇష్టం. అది నా మనసుకు నచ్చిన విషయం. నన్ను మెరుపు తీగలా తీర్చిదిద్దడానికి నాదైన నిపుణుల బృందం ఉంది. వాళ్లు కొత్త ప్రయోగాలు చేయడాన్ని ప్రోత్సహిస్తాను. సోషల్ మీడియా ట్రోలింగ్ అస్సలు పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని నా మూడ్ పాడుచేసుకోను అని కొన్ని విషయాలపై పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది బ్యూటీ.