జవాన్ రెమ్యూనరేషన్ పై స్పందించిన దీపికా పదుకునే , 30 కోట్లు తీసుకుందా..?
జవాన్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది హీరోయిన్ దీపికా పదుకునే. అసలే దీపికా ఇమేజ్ గురించి తెలియనివారు ఉండదరు. అటు వంటిది.. జవాన్ లో అతిధి పాత్ర చేసినందుక దీపిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?
జవాన్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది హీరోయిన్ దీపికా పదుకునే. అసలే దీపికా ఇమేజ్ గురించి తెలియనివారు ఉండదరు. అటు వంటిది.. జవాన్ లో అతిధి పాత్ర చేసినందుక దీపిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?
జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లకుపైనే కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో దీపిక రెమ్యూనరేషన్ (Jawan Remunaration) ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అతిథి పాత్రకోసమే దీపిక ఏకంగా 30కోట్లు తీసుకుందంటూ బీటౌన్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఇక తాజాగా ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ రూమర్సే అంటూ కొట్టి పారేసింది. రీసెంట్ గా జవాన్’తోపాటు రణ్‌వీర్‌సింగ్ 83, సర్కస్ లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది బ్యూటీ. అయితే ఆసినిమాల కథలు నచ్చడంలో.. అందులో గెస్ట్ రోల్స్ చేయడానికి ఒప్పుకున్నట్టు చెప్పింది.
అంతేకాకుండా.. షారుఖ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. జవాన్‌లో తన పారితోషకం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆ పాత్రకు తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసింది.
Deepika Padukone
ప్రస్తుతం దీపిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. హీరోయిన్ గా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు దీపికాకు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అంతే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో నటిస్తోంది. ఈసినిమా పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తోంది.