MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రణ్‌ వీర్‌ సింగ్‌తో డైవర్స్ రూమర్స్ ని పటాపంచల్ చేసిన దీపికా పదుకొనె.. బ్రిలియెంట్‌ ఆన్సర్..

రణ్‌ వీర్‌ సింగ్‌తో డైవర్స్ రూమర్స్ ని పటాపంచల్ చేసిన దీపికా పదుకొనె.. బ్రిలియెంట్‌ ఆన్సర్..

దీపికాతో విడాకుల రూమర్స్ పై రణ్‌ వీర్‌ సింగ్‌ స్పందించినా  రూమర్స్ ఆగడం లేదు. తాజాగా దీపికా పదుకొనె స్పందించింది. పరోక్షంగా రూమర్స్ ని పటాపంచల్‌ చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 12 2022, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ranveer Singh and Deepika Padukone

Ranveer Singh and Deepika Padukone

బాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ రణ్‌ వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె ప్రస్తుతం అన్యోన్య జంటగా రాణిస్తుంది. ఎవరికి వారు కెరీర్‌ పరంగా తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్‌ లైఫ్‌ విషయంలో మాత్రం బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటి వరకు మంచి భార్యాభర్తలుగా పేరుతెచ్చుకున్నారు. కానీ ఉన్నట్టుండి వీరి మ్యారేజ్‌ కి సంబంధించిన రూమర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లోనూ దుమారం రేపుతున్నాయి. ఈ జంటపై ఓ సినీ విమర్శకుడు ఉమైర్‌ సందు చేసిన కామెంట్ హాట్‌ టాపిక్‌గా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇటీవల తన డైవర్స్ రూమర్స్ పై రణ్‌వీర్‌ సింగ్‌ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంచేశారు. 2012లో దీపికాతో నాకు ప్రేమ ప్రారంభమైందని, ఇప్పుడు 2022 రన్‌ అవుతుందని, ఈ పదేళ్లలో ఆమెపై ప్రేమ మరింత పెరిగిందని, ఆమెని ఎంతగానో ప్రేమిస్తున్నానని, దీపికా తనకు దొరికిన అదృష్ట దేవత అని, ఆమెని ఎప్పటికీ వదులుకోనని తెలిపారు రణ్‌వీర్‌ సింగ్. 
 

35

అయినా ఆ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా దీపికా పదుకొనె సైతం దీనిపై స్పందించింది. పరోక్షంగా రూమర్స్ ని పటాపంచల్‌ చేసింది. ఇటీవల దీపికా లగ్జరీ బ్రాండ్‌ లూయిస్‌ విట్టన్‌ తరఫున పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంపై మెరిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. దీనిపై ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. రణ్‌ వీర్‌ సింగ్‌ పనిలో వారం రోజులుగా మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాడని, అతను ఇంటికి వచ్చి తనని చూడగానే తప్పకుండా సంతోషిస్తాడని చెప్పింది. పరోక్షంగా తమపై ఆయన ప్రేమ తగ్గలేదని, తన ప్రేమ సైతం అలాగే ఉందనే విషయాన్ని దీపికా చెప్పింది. 

45

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. అభిమానులు ఈ వీడియో క్లిప్‌ ని షేర్‌ చేస్తూ వీరిపై వచ్చిన రూమర్స్ కి ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ జంట ముంబయిలోని అలీబాగ్‌లో సముద్ర తీరానికి దగ్గరలో ఓ ఇంటిని కొన్నారు. గృహ ప్రవేశం కూడా చేశారు. ఈ సందర్భంగా చేసిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను రణ్‌వీర్‌ సింగ్‌ పంచుకున్న విషయం తెలిసిందే. ఈ భవనం దాదాపు రెండున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది. 18వేల చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ఇందులో ఐదు బెడ్‌రూమ్‌లున్నాయి. దీని విలువల రూ.22కోట్లు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ క్రేజీ కపుల్స్ ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

55

ప్రస్తుతం దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ పాన్‌ ఇండియా మూవీ `ప్రాజెక్ట్ కే`లో ప్రభాస్‌తో కలిసి నటిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు హిందీలో `పఠాన్‌`, `జవాన్‌` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు రణ్‌ వీర్‌ సింగ్‌ `సర్కస్‌`, `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహాని` చిత్రాల్లో నటిస్తున్నాడు. `సర్కస్‌`లో దీపికా గెస్ట్ రోల్‌ చేస్తుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved