Deepika Padukone: అరుదైన గౌరవం పొందిన దీపికా పదుకొనె
దీపికా పదుకునె అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మంది ప్రముఖులకు ఇచ్చే టైం 100 ఇంపాక్ట్ అవార్డ్ ను సొంతం చేసుకుంది దీపికా.

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనెకు అరుదైన గౌరవం దక్కింది. టైం 100 ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. మానసిక ఒత్తిడిపై ఆమె అవగాహన కల్పిస్తూ ఆమె అందించిన సేవలకు గాను దీపికకు ఈ అవార్డు అభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల జాబితాలో ఇప్పుడు దీపికా కూడ చేరింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించింది. ఈ విషయాన్ని పంచుకుంటూ.. దీపికా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ..ఈ సోమవారం శుభవార్తతో రోజు మొదలైంది అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకుంది.ఈ పోస్ట్ చూసిన అభిమానులు, బాలీవుడ్ సెలెబ్రెటీలు దీపికాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, రాజకీయ, కళా రంగంలో అందించే సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరిస్తారు. యుఏఈ అడ్వాన్స్‌డ్ టెక్కాలజీ మంత్రి సారా అల్ అమీరి, ప్రముఖ సింగర్, రచయిత ఎల్లి గౌల్డింగ్, హుడా బ్యూటీ వ్యవస్థాపకులు హుడా కట్టాన్, సింగీత కళాకారుడు విల్ ఐయామ్‌లు కూడా ఈ అవార్డుకు ఎన్నికయ్యారు.
ఈ ఏడాది వారితో దీపికా ఈ అవార్డును అందుకోవడం విశేషం. కాగా బాలీవుడ్‌లో ఎన్నో విజయాలను అందించింది స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అంతేకాదు దీపికా లీవ్ లవ్ లైఫ్ అనే ఫౌండేషన్ ద్వారా మానసిక ఒత్తిడిపై అవగాహన కల్పిస్తున్నారు దీపికా.
దీని ద్వారా ఎంతో మంది మానసిక రోగులకు చికిత్స కూడా అందిస్తుంది. అయితే దీపికా గతంలో చాలా మానసిక సమస్యలతో ఇబ్బంది పడింది. ముఖ్యంగా తన జీవితంలో లవ్ ఫేయిల్యూర్ తరువాత ఎంతో సంఘర్షణ ఎదుర్కొన్నట్ట గతంలో ప్రకటించింది కూడా. అందుకే తను మానసికంగా వీక్ గా ఉన్నవారికి కౌన్సిలింగ్ లాంటివి చేయిస్తుంటుంది.