MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డేవిడ్ వార్నర్ మామూలోడు కాదుగా, నిమిషానికి ఎన్ని కోట్లో తెలుసా.. ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా ఛార్జ్ ?

డేవిడ్ వార్నర్ మామూలోడు కాదుగా, నిమిషానికి ఎన్ని కోట్లో తెలుసా.. ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా ఛార్జ్ ?

వార్నర్ కామియో రోల్ లో నటించిన నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో వార్నర్ సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాల పాటు అలరించబోతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 24 2025, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
David Warner Robinhood

David Warner Robinhood

క్రికెట్ అభిమానులు డేవిడ్ వార్నర్ ని ముద్దుగా వార్నర్ భాయ్, వార్నర్ మామ అని పిలుచుకుంటారు. ఐపీఎల్ ద్వారా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. దీనికి తోడు తెలుగు సినిమాలకి సంబంధించిన డైలాగులు, స్టెప్పులతో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడంతో వార్నర్ పాపులారిటీ ఇంకా పెరిగింది. పుష్ప చిత్రంలోని స్టెప్పుని వార్నర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టేడియంలో కూడా వేసి అలరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nithiin, david warner

Nithiin, david warner

దీనితో వార్నర్ కి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వార్నర్ త్వరలో తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. వార్నర్ కామియో రోల్ లో నటించిన నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో వార్నర్ సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాల పాటు అలరించబోతున్నారు. 

35
David Warner with Sreeleela & Ketika Sharma

David Warner with Sreeleela & Ketika Sharma

ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి క్రికెట్ ద్వారా అభిమానులకు చేరువై ఇప్పుడు తెలుగు సినిమాలో నటించడం అంటే విచిత్రమే అని చెప్పాలి. వార్నర్ ఈ చిత్రంలో నటించి చేతులు దులుపుకోలేదు.. సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగం అవుతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వార్నర్ హాజరైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ ప్రసంగం ఆకట్టుకుంది. గత 15 ఏళ్లుగా మీరు నాపై కురిపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. రాబిన్ హుడ్ చిత్ర ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు డైరెక్టర్ వెంకీకి థ్యాంక్స్. 
 

45

ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది అని డేవిడ్ వార్నర్ అన్నారు. చివర్లో ఏదైనా తెలుగులో మాట్లాడాలి అని డైరెక్టర్ వెంకీ వార్నర్ ని రిక్వస్ట్ చేశారు. దీనితో వార్నర్ వచ్చీ రాని తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నవ్వులు పూయించారు. ఈ చిత్రంలో వార్నర్ 3 నిమిషాల పాత్రలో నటిస్తున్నారు అని నితిన్ ఆల్రెడీ రివీల్ చేశారు. అయితే ఈ పాత్ర కోసం వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందుతున్న సమాచారం మేరకు వార్నర్ ఈ మూవీ కోసం ఏకంగా 3 కోట్ల పారితోషికం అందుకున్నారట. 
 

55

అంటే ఒక్కో నిమిషానికి వార్నర్ కోటి రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది కేవలం సినిమాలో రోల్ కి మాత్రమే. ఇక ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు లెక్క వేరే ఉందట. ప్రమోషన్స్ కోసం కోటి రూపాయలు అదనంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తంగా వార్నర్ మామ రాబిన్ హుడ్ నుంచి 4 కోట్లు పిండుకున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Recommended image2
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Recommended image3
Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved