MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హౌస్ లోకి రాగానే శ్రీజని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసిన దివ్వల మాధురి, రమ్య.. చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

హౌస్ లోకి రాగానే శ్రీజని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసిన దివ్వల మాధురి, రమ్య.. చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆదివారం రోజు డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఫ్లోరా షైనీతో పాటు శ్రీజ దమ్ము కూడా ఎలిమినేట్ అయింది. అయితే శ్రీజ ఎలిమినేషన్ ప్రక్రియ క్రేజీగా సాగింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2025, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డబుల్ ఎలిమినేషన్ 
Image Credit : Asianet News

డబుల్ ఎలిమినేషన్ 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా సండే రోజు ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అయేషా జీనత్, సాయి, దివ్వల మాధురి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ ఎంట్రీ తో రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. డబుల్ ఎలిమినేషన్ తో షాకిచ్చారు. ముందుగా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ వచ్చాక దమ్ము శ్రీజ ఎలిమినేషన్ జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డేంజర్ జోన్ లో శ్రీజ, సుమన్ శెట్టి 
Image Credit : Asianet News

డేంజర్ జోన్ లో శ్రీజ, సుమన్ శెట్టి 

దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులతోనే ప్లాన్ చేశారు. అన్ని టాస్కులలో సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా శ్రీజ, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉండిపోయారు అని నాగార్జున అన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులు డిసైడ్ చేస్తారు అని నాగార్జున అన్నారు. సుమన్ శెట్టి దగ్గర బ్లూ కలర్ బెలూన్స్.. శ్రీజ దగ్గర ఎల్లో కలర్ బెలూన్స్ ఉంచారు. వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులు ఒక్కొకరుగా వచ్చి.. శ్రీజ, సుమన్ లలో ఎవరు ఎలిమినేట్ కావాలని భావిస్తే వారి బెలూన్ ని కట్ చేయాలి. కారణం చెప్పాలి అని నాగార్జున అన్నారు. 

34
వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియ 
Image Credit : Asianet News

వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియ 

ముందుగా అయేషా వచ్చారు. ఆమె శ్రీజ బెలూన్ ని కట్ చేశారు. శ్రీజ కంటే సుమన్ శెట్టి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ అని, ఆయనతో కలిసి హౌస్ లో ఉండాలని కోరుకుంటున్నట్లు అయేషా పేర్కొంది. ఆ తర్వాత సాయి.. సుమన్ శెట్టి బెలూన్ తొలగించారు. సుమన్ కంటే శ్రీజ గేమ్ బాగా ఆడుతుందని సాయి తెలిపారు. దివ్వల మాధురి, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష వీళ్లంతా శ్రీజ బెలూన్స్ నే తొలగించారు. 

44
శ్రీజపై దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు 
Image Credit : Asianet News

శ్రీజపై దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు 

దివ్వల మాధురి.. శ్రీజ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ప్రతి విషయంలో అనవసరంగా వేలు పెడుతుందని, అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుందని మాధురి తెలిపింది. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మాట్లాడుతూ.. శ్రీజ కంటే సుమన్ మాట్లాడే విధానం బావుంటుంది అని పేర్కొంది. మొత్తంగా సుమన్ కంటే శ్రీజ బెలూన్స్ తగ్గిపోయాయి. దీనితో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత శ్రీజ వేదికపైకి వెళ్లి కంటెస్టెంట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చి వెళ్ళిపోయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
గృహలక్ష్మి టీవీ సీరియల్ తో ఫేమస్, జాబ్ వదిలేసి బుల్లితెరపైకి.. నిఖిల్ నాయర్ ఎవరో తెలుసా ?
Recommended image2
బాలకృష్ణ ఒప్పుకుని తప్పు చేసిన 7 సినిమాలు, అతి దారుణమైన ఆ రెండింటి గురించి తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved