MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్లంతా లైనేసింది ఆయనకే..స్టార్ హీరో తండ్రిని హీరోగా నటించమని బలవంతం చేసిన నటి ఎవరో తెలుసా ?

హీరోయిన్లంతా లైనేసింది ఆయనకే..స్టార్ హీరో తండ్రిని హీరోగా నటించమని బలవంతం చేసిన నటి ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో ఓ అగ్ర హీరో తండ్రిని హీరోగా నటించమని హీరోయిన్ బలవంతం చేశారు. ఆమె ఎందుకు అలా చేశారు ? ఆ హీరో తండ్రి ఎవరు ఇలాంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 02 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెరవెనుకే నిర్మాతలు, దర్శకులు
Image Credit : NDTV

తెరవెనుకే నిర్మాతలు, దర్శకులు

సినీ రంగంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులకు మాత్రమే పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. దర్శకులు నిర్మాతలు తెరవెనుకే ఉంటారు. వారికి అంతగా గుర్తింపు ఉండదు. ఇప్పుడంటే సోషల్ మీడియా, మీడియా ద్వారా అందరి గురించి తెలుస్తోంది కానీ ఒకప్పుడు సినిమా అంటే ఆడియన్స్ చర్చించుకునేది ఎక్కువగా హీరో, హీరోయిన్ల గురించి మాత్రమే. అలాంటి టైంలో కూడా నిర్మాతగా తన ప్రత్యేకత చాటుకుని టాలీవుడ్ లో జయకేతనం ఎగురవేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు మూవీ మొఘల్ రామానాయుడు.

25
నిర్మాతగా వెలుగు వెలిగిన రామానాయుడు
Image Credit : Facebook / Venkatesh

నిర్మాతగా వెలుగు వెలిగిన రామానాయుడు

ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల వరకు ఎన్నో చిత్రాలు నిర్మించారు. బాలీవుడ్ లో సైతం రామానాయుడు సినిమాలు నిర్మించారు. రామానాయుడు నటుడిగా కూడా అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. ఆ విధంగా నటనపై తనకున్న కోరిక నెరవేర్చుకున్నారు. తాను నిర్మాతగా రాణిస్తున్న బిగినింగ్ డేస్ లో ఆసక్తికర సంఘటన జరిగింది అని రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Related Articles

Related image1
ఈ వారం మొత్తం పండగే పండగ.. ఓటీటీలోకి ప్రభాస్, శర్వానంద్, శివకార్తికేయన్ సినిమాలు..ఇదిగో కంప్లీట్ లిస్ట్
Related image2
ఒకవైపు చిరు మరోవైపు రజినీ.. సౌందర్య దెబ్బకు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిన నటుడు ఎవరో తెలుసా ?
35
శాంతకుమారి కామెంట్స్
Image Credit : Asianet News

శాంతకుమారి కామెంట్స్

రామానాయుడు నిర్మించిన అనేక చిత్రాల్లో అలనాటి నటి శాంతకుమారి నటించారు. శశిరేఖ పరిణయం, శ్రీ వెంకటేశ్వర మహత్యం లాంటి పౌరాణిక చిత్రాల్లో నటించారు. రాముడు భీముడు మూవీలో కూడా ఆమె నటించారు. ఆమె చాలా జోవియల్ గా మాట్లాడే వ్యక్తి అని రామానాయుడు అన్నారు. నాతో బాగా క్లోజ్ గా ఉంటుంది.

45
హీరోగా నటించమని చెప్పారు
Image Credit : google

హీరోగా నటించమని చెప్పారు

షూటింగ్ గ్యాప్ లో నాతో తమాషాగా మాట్లాడేవారు. ఆమె మాటలు కొన్ని సార్లు హద్దులు దాటినప్పటికీ ఆమెని ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. హీరోయిన్లు కూడా అభ్యంతరం చెప్పేవారు కాదు. నాతో ఆమె మాట్లాడుతూ.. ఒరేజ్ నువ్వు హీరోగా నటించరా.. హీరోయిన్లు అంతా నీ వంకే చూస్తున్నారు రా. వాళ్ళు నీకు సైట్ కొడుతున్నారు రా.

55
హీరోయిన్లు లైన్ వేసేవారు
Image Credit : Social Media

హీరోయిన్లు లైన్ వేసేవారు

హైట్ బాగా ఉన్నావు, ఎర్రగా బుర్రగా ఉన్నావు. రామారావు తర్వాత అందంగా ఉండేది నువ్వే. నా మాట విని హీరోగా నటించు అని తరచుగా చెప్పేవారు. నేను కూడా చేస్తాను లేవే అని చెప్పేవాడిని. ఆమె బలవంతం చేయడంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు వేసేవాడిని అని రామానాయుడు తెలిపారు. మీకు నిజంగానే హీరోయిన్లు లైన్ వేశారా అని ప్రశ్నించగా.. శాంతకుమారి గారు గమనించారు అంటే నిజమే అయి ఉంటుంది అని ఫన్నీగా రామానాయుడు తెలిపారు. రామానాయుడు వారసులు సురేష్ బాబు నిర్మాతగా రాణిస్తున్నారు. మరో తనయుడు వెంకటేష్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay-Rashmika Wedding: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి డేట్‌, లొకేషన్‌ ఫిక్స్.. ఆ వార్తలకు చెక్‌
Recommended image2
MSG 21 Day Collections: సండే రోజు సడెన్‌ జంప్‌.. చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌
Recommended image3
విజయశాంతి ని లేడీ సూపర్ స్టార్ గా మార్చిన స్టార్ హీరో తండ్రి ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
ఈ వారం మొత్తం పండగే పండగ.. ఓటీటీలోకి ప్రభాస్, శర్వానంద్, శివకార్తికేయన్ సినిమాలు..ఇదిగో కంప్లీట్ లిస్ట్
Recommended image2
ఒకవైపు చిరు మరోవైపు రజినీ.. సౌందర్య దెబ్బకు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిన నటుడు ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved