అల్లు శిరీష్ కొంప ముంచిన మొంథా తుఫాన్, ఎంగేజ్మెంట్ ప్లాన్స్ చెడగొట్టేసింది
మొంథా తుఫాన్ ప్రభావం అల్లు శిరీష్ పై గట్టిగా పడింది. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ప్లాన్స్ ని మొంథా తుఫాన్ చెడగొట్టేసింది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

అల్లు శిరీష్ నిశ్చితార్థం ఫ్లాన్స్ చెల్లాచెదురు
అల్లువారబ్బాయి అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే శిరీష్ తన నిశ్చితార్థం తేదీ ప్రకటించారు. అక్టోబర్ 31న నైనికా అనే అమ్మాయితో శిరీష్ నిశ్చితార్థం జరగనుంది. అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుకని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో అవుట్ డోర్ ఈవెంట్ గా ప్లాన్ చేశారు. కానీ అల్లు శిరీష్ నిశ్చితార్థం ఫ్లాన్స్ ని మొంథా తుఫాన్ చెడగొట్టింది. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
శిరీష్ ఎంగేజ్మెంట్ పై మొంథా ఎఫెక్ట్
శిరీష్, నైనికా నిశ్చితార్థం కోసం అవుట్ డోర్ లో అందమైన వేదిక ఏర్పాటు చేయబడింది. పచ్చని గార్డెన్ మధ్యలో గాజు కవరుతో ఉన్న ప్రాంగణంలో, అద్భుతమైన డెకరేషన్‌తో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ సాయంత్రానికి భారీ వర్షాలు, గాలులు తుఫాన్ వల్ల వేదిక అంతా తడిసి ముద్దయింది.
దేవుడి ప్లాన్ మరోలా ఉంది
శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదిక ఫోటోను షేర్ చేశారు. అందులో నిశ్చితార్థ ప్రాంగణం తడిసిపోయి, చెల్లాచెదురుగా ఉన్న ఫర్నీచర్ తో కనిపించింది. ఆ ఫోటోకు అల్లు శిరీష్ కామెంట్ పెట్టారు. అవుట్ డోర్ ఎంగేజ్మెంట్ కోసం ప్లాన్ చేశాం. కానీ దేవుడి ప్లాన్ మరోలా ఉంది అంటూ శిరీష్ కామెంట్స్ పెట్టారు.
ఇది కూడా మధుర జ్ఞాపకమే
ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన పోస్ట్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా ఒక మధుర జ్ఞాపకమే అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంగేజ్మెంట్ వేడుక పాడైపోయినప్పటికీ సిబ్బంది తిరిగి ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. శుక్రవారం రోజు అల్లు శిరీష్ నిశ్చితార్థం జరగనుంది.
తమ్ముడి ఎంగేజ్మెంట్ కోసం వచ్చిన అల్లు అర్జున్
శిరీష్ అక్టోబర్ 1న తన ఎంగేజ్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు ఆయన నైనికాతో కలిసి పారిస్‌లో తీసుకున్న రొమాంటిక్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలో ఇద్దరూ చేతులు పట్టుకుని సంతోషంగా కనిపించారు. అప్పటినుంచి ఈ జంట నిశ్చితార్థ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా షూటింగ్ ముగించుకుని తన తమ్ముడు శిరీష్ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.