MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నరేష్-పవిత్ర విడిపోయారా? నాలుగో ప్రయత్నం కూడా విఫలమేనా!

నరేష్-పవిత్ర విడిపోయారా? నాలుగో ప్రయత్నం కూడా విఫలమేనా!

నటుడు నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా ప్రకటించారు. కాగా పవిత్ర లోకేష్ తో ఆయన బంధం ముగిసిందని, ఇద్దరూ విడిపోయారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 12 2022, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నరేష్-పవిత్ర లోకేష్ ఎపిసోడ్ ఆ మధ్య మీడియాలో ప్రముఖంగా వినిపించింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. నరేశ్, పవిత్ర మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని జంటగా సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటోలు బయటికి రావడంతో పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరిగింది. 
 

26


ఈ వార్తలపై నరేష్ నేరుగా స్పందించారు. పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాము. ఆమె అంటే నాకు ఇష్టం. పరస్పర అవగాహన కుదిరింది. జీవితంలో అభిమానించే, ప్రేమించే నమ్మకమైన వ్యక్తి దొరికింది, పవిత్రతో నా ప్రయాణం అలా సాగుతుంది అన్నారు. 
 

36

ఇక వివాహం అంటారా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. అలాగే నాకు వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు. రిలేషన్షిప్ కి మ్యారేజ్ లైసెన్సు మాత్రమే. పెళ్లైన ప్రతి పది జంటల్లో ఎనిమిది మంది విడిపోతున్నారు. పెళ్లి అనేది అనవసరం అన్న అర్థంలో ఆయన మాట్లాడారు. మూడో భార్య రమ్యతో నరేష్ కి విడాకులు కాలేదని, అందుకే ఆయన అబద్ధం చెబుతున్నారనే ఒక వాదన ఉంది. 

46

పవిత్రను నరేష్ వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా ఇద్దరూ కలిసి జీవిస్తున్న మాట వాస్తవం. వారే స్వయంగా ధృవీకరించారు కాబట్టి ఎలాంటి సందేహం లేదు . కాగా పవిత్ర లోకేష్ తో కూడా నరేష్ విడిపోయారు, ఆమెను వదిలేశాడనేది లేటెస్ట్ న్యూస్. రెండు రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో ఇది చర్చనీయాంశం అయ్యింది.

56


ఈ క్రమంలో నరేష్ నాలుగో ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందా? పవిత్రను కూడా వదిలేశారా? అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆయన మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారట. ఆ కారణంగానే పవిత్రకు గుడ్ బై చెప్పేశాడట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి వరుస కథనాల నేపథ్యంలో నరేష్ స్పందిస్తారేమో చూడాలి. 

66
Naresh- Pavitra Lokesh

Naresh- Pavitra Lokesh

దివంగత నటి విజయనిర్మల కుమారుడైన నరేష్ మూడు వివాహాలు చేసుకున్నారు. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి న్యాయపోరాటం చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ నరేష్ కి స్టెప్ ఫాదర్ అవుతారు. విజయనిర్మలపై ప్రేమతో నరేష్ ని కృష్ణ సొంత కొడుకుగా ఆదరించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే
Recommended image2
Upasana: రామ్‌ చరణ్‌ ఆమెతో కనిపించాడంటే ఇక అంతే, మొత్తం రచ్చ రచ్చ.. ఉపాసనలో జెలసీ పీక్‌ లెవల్‌
Recommended image3
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved