బికినీలో కృతి శెట్టి?... డబుల్ రెమ్యూనరేషన్ కి సై అన్న యంగ్ బ్యూటీ?
టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కృతి శెట్టి తన అప్ కమింగ్ మూవీలో బికినీలో కనిపించనున్నారట.
Krithi Shetty
కృతి శెట్టి సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్... స్కిన్ షో చేసింది లేదు. అయితే శృంగార సన్నివేశాల్లో నటించారు. హీరోయిన్ గా ఆమె మొదటి చిత్రం ఉప్పెనలో ఓ శృంగార సన్నివేశం ఉంది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్-కృతి మధ్య బోల్డ్ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
అలాగే సెకండ్ మూవీ శ్యామ్ సింగరాయ్ లో కూడా కృతి శెట్టి ఆ తరహా సన్నివేశంలో నటించారు. నాని-కృతి శెట్టి బెడ్ రూమ్ సన్నివేశంలో హీటు పుట్టించారు. ఈ రెండు చిత్రాలు కృతి శెట్టికి మరపురాని విజయాలు అందించాయి.
కాగా కృతి అప్ కమింగ్ మూవీలో బికినీలో దర్శనమివ్వనుందట. ఈ మేరకు నిర్మాతలు ఆమెను కన్విన్స్ చేశారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ ప్రాజెక్ట్ కోసం కృతి శెట్టిని కలిసిన మేకర్స్ డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తాం బికినీలో కనిపించాల్సి ఉంటుందని ఆఫర్ చేశారట. కృతి అందుకు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు.
జరుగుతున్న ప్రచారం నిజమైతే కృతి శెట్టి బోల్డ్ అవతార్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేయనుంది. ఉప్పెన మూవీతో కృతి స్టార్డం తెచ్చుకుంది. ఆ చిత్ర విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తన వయసుకు తగ్గ పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. కృతి శెట్టి యంగ్ టీనేజ్ లుక్ మెస్మరైజ్ చేసింది.
ఇక శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. బంగార్రాజు మూవీతో కృతి హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ గా రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేశారు.
అయితే గత ఏడాది ఆమెకు మూడు వరుస ప్లాప్స్ పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇది ఆమె కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా కస్టడీ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. కార్తీతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే ఓ మలయాళ చిత్రంలో కృతి నటిస్తున్నారు.