కూలీ వసూళ్లు కుప్పకూలుతున్నాయా? సూపర్ స్టార్ మూవీ 7 రోజుల కలెక్షన్స్ ఎంత?
రజనీకాంత్, నాగార్జున, శోభిన్ షాహిర్ వంటి స్టార్స్ కలిసి నటించిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక వారం కావస్తోంది. మరి ఈ ఏడు రోజులు ఈసినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం.

రజినీకాంత్ 171 మూవీ
రజనీకాంత్ 171వ సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో రజనీకాంత్ దేవాగా, నాగార్జున సైమన్‌గా, శోభిన్ షాహిర్ దయాలుగా, శృతిహాసన్ ప్రీతిగా, అమీర్ ఖాన్ దాహాగా, ఉపేంద్ర కాలీశ్వర్ గా నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించారు.
KNOW
కూలీకి కలిసొచ్చిన సెలవులు
ఆగస్టు 14న విడుదలైన కూలీ సినిమా ఫస్ట్ డేనే నెగెటీవ్ రివ్యూస్ ను ఫేస్ చేసినప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లు వసూలు చేసిందని మూవీ టీమ్ ప్రకటించింది. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో, తొలి నాలుగు రోజుల్లోనే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా .404 కోట్లు వసూలు చేసిందని సన్ పిక్చర్స్ ప్రకటించింది.
తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు
వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టిన కూలీ సినిమా కలెక్షన్లు వారం రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. సోమవారం 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మంగళవారం 15 కోట్లకు పడిపోయింది. బుధవారం కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 1.70 కోట్లు, హిందీ వెర్షన్ 1.49 కోట్లు, కన్నడ వెర్షన్ 10 లక్షలు వసూలు చేశాయి. దీంతో భారత్‌లో మాత్రమే ఈ సినిమా 7.64 కోట్లు వసూలు చేసింది.
కోర్టుకెక్కిన కూలీ నిర్మాత
కూలీ సినిమా విడుదలై వారం రోజులు అయింది, మొత్తం మీద ఈ సినిమా కలెక్షన్లు కూడా విడుదలయ్యాయి. దీని ప్రకారం, ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 447 కోట్లు వసూలు చేసింది. కూలీకి A సర్టిఫికేట్ ఇచ్చి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోవడంతో, సన్ పిక్చర్స్ సినిమాను సెన్సార్ బోర్డుకు తిరిగి పంపించి U/A సర్టిఫికేట్ జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ వారం చివరి నాటికి సినిమాకు U/A సర్టిఫికేట్ ఇస్తే, సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి సెన్సార్ బోర్డ్ నిర్ణయం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, వేచి చూడాలి.