- Home
- Entertainment
- వివాదంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' దర్శకురాలు కార్తీకి.. బొమ్మన్, బెల్లీ తీవ్ర ఆరోపణలు, నమ్మించి మోసం
వివాదంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' దర్శకురాలు కార్తీకి.. బొమ్మన్, బెల్లీ తీవ్ర ఆరోపణలు, నమ్మించి మోసం
95వ ఆస్కార్ అవార్డుల వేడుకకి ముందు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే ఒక డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారని ఎవ్వరికి తెలియదు. కానీ ఆస్కార్ అవార్డు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఫిలిం మొత్తం ప్రపంచం దృష్టినే ఆకర్షించింది.

95వ ఆస్కార్ అవార్డుల వేడుకకి ముందు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే ఒక డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారని ఎవ్వరికి తెలియదు. కానీ ఆస్కార్ అవార్డు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఫిలిం మొత్తం ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ డాక్యుమెంటరీ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని దర్శకురాలు కార్తీకి గోన్సల్వేస్ తెరకెక్కించారు. సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
తప్పిపోయిన ఏనుగులని సంరక్షించే జంటగా బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రధాని మోడీ సైతం వీరిని కలసి అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బొమ్మన్ బెల్లీ దంపతులు దర్శకురాలు కార్తీకి పై సంచలన ఆరోపణలు చేశారు. దీనితో ది ఎలిఫెంట్ విస్పరర్స్ వివాదంగా మారింది.
గుడ్ విల్ గెస్చర్ కింద బొమ్మన్, బెల్లీ ఈ చిత్ర మేకర్స్ కి లీగల్ నోటీసులు పంపారు. తమకి పరిహారం కింద రూ 2 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఈ చిత్ర చిత్రీకరణ జరిగినంత కాలం కార్తీకి తో బొమ్మన్ బెల్లికి స్నేహపూర్వక బంధం కొనసాగింది. ఆస్కార్ సాధించిన తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషానికి గురయ్యారు.
తమకి వస్తున్న గుర్తింపు చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ సమయంలో తమ పట్ల కార్తీకి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని బొమ్మన్ బెల్లీ ఆరోపించారు. ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత సన్మాన కార్యక్రమంలో తమకి అవమానం జరిగింది అని ఈ జంట తెలిపారు. తమని ఆస్కార్ అవార్డు తాకేందుకు కూడా వారు అనుమతించలేదు.
ముంబై నుంచి నీలగిరి రావడానికి కనీసం చార్జీలు చెల్లించలేదు. కానీ దర్శకురాలు, నిర్మాతలు మాత్రం ఆస్కార్ గెలిచినా తర్వాత ప్రభుత్వం నుంచి , ఇతర చారిటి సంస్థలు, డొనేషన్స్ ఇచ్చిన వారి నుంచి పెద్ద మొత్తంలో లబ్ది పొందినట్లు బొమ్మన్, బెల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డాక్యుమెంటరీలో ఓ ఒక సన్నివేశం కోసం తామే రూ. లక్ష ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఆ డబ్బుని తాము తర్వాత తిరిగి చెల్లిస్తామని కార్తీకి మాట ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆమె కనీసం మా ఫోన్ ని కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటూ బొమ్మన్, బెల్లీ వాపోయారు. వీరి ఆరోపణలపై మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేసారు. ఏనుగుల సంరక్షణలో బొమ్మన్, బెల్లీ సహా అటవీశాఖ కృషిని ప్రపంచానికి తెలియజేయడమే తమ ప్రాథమిక లక్ష్యం అని.. ఈ చిత్రం ద్వారా అది నెరవేరినట్లు తెలిపారు. కానీ ఆరోపణలపై మాత్రమే మేకర్స్ సమాధానం ఇవ్వలేదు.