Comedian Sudhakar ; సుధాకర్ ఇప్పుడెలా ఉన్నారో చూశారా? బక్కచిక్కిపోయిన కమెడియన్!
కమెడియన్ సుధాకర్ (Sudhakar) ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. రీసెంట్ ఆయన కొడుకు పెళ్లి జరగడంతో అతని లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

టాలీవుడ్ ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ (Beta Sudhakar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలు, నటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. ప్రస్తుతం సుధాకర్ సినిమాలకు దూరంగా ఉన్నారు.
వయస్సు పైబడుతుండటంతో ఆరోగ్యం సహకరించక సుధాకర్ సినిమాకు దూరమయ్యారు. 17 ఏళ్లుగా వెండితెరపై కనిపించడం లేదు. దాంతో వార్తలో నిలవడం లేదు. కానీ ఆయన హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులు తెలుసుకుంటున్నారు.
ఆ మధ్యలో బతికుండగానే చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. దానిపై ఆయన స్పందించి అదంతా అబద్ధమని చెప్పారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సుధాకర్ లేటెస్ట్ లుక్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో పలు ఇంటర్వ్యులు ఇచ్చిన సుధాకర్ అప్పటికిప్పటికీ చాలా మారిపోయారు. ఆయన తాజా లుక్ హాట్ టాపిక్ గ్గా మారింది.
రీసెంట్ గా తనయుడు బెనిడిత్ మైఖేల్ పెళ్లి కావడంతో వేడుకల్లో ఇలా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఈ మ్యారేజ్ కు కమెడియన్ బ్రహ్మానందం, జగపతి బాబు హాజరయ్యారు. ఆయన కొడుకును త్వరలో హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. చిరంజీవి అందుకు సహకరించనున్నారని గతంలో ఆయనే చెప్పారు.
గతంతో పోల్చితే సుధాకర్ కాస్తా బక్కచిక్కిపోయారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు కాస్తా ఆందోళన పడుతున్నారు. ఏదేమైనా ఆయన ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. తాజా ఫొటోల్లో ఎనర్జిటిక్ గానే కనిపిస్తున్నారు.