Laila Controversy: పృధ్వీ క్షమాపణ వీడియో, వెనక అసలేం జరిగింది?
Laila Controversy: ‘లైలా’ సినిమాని కిల్ చేయకండి. సినిమాని గౌరవిద్దాం.. ప్రేమిద్దాం. నాకింత క్రేజ్ వచ్చిందంటే సినిమానే కారణం. నా వల్ల ఈ సినిమా ఇబ్బంది పడకూడదు. ఇంతటితో దీనికి ముగింపు పలకండి.

Comedian prudhviraj offers apology on his political remarks during event of #Laila in telugu
Laila Controversy: గత నాలుగు రోజులుగా జరుగుతున్న వివాదానికి పృధ్వీ తెరదించారు. “లైలా” సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పిలుపు ఇవ్వడంతో ఇప్పటికే హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు.
అయితే, క్షమాపణ చెప్పాల్సింది హీరో కాదు కామెంట్లు చేసిన పృథ్వీ అంటూ మళ్ళీ ట్రెండ్ కావడంతో ఆ కమెడియన్ సినిమా బాగు కోసం ముందుకొచ్చారు. “నా వల్ల సినిమా దెబ్బతినకూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను,” అని ఒక వీడియో విడుదల చేశారు.
Comedian prudhviraj offers apology on his political remarks during event of #Laila in telugu
పృధ్వీ ఆ వీడియోలో ...‘‘గోదావరి జిల్లాలో పుట్టి, పెరిగా కాబట్టి వెటకారం మాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. ‘లైలా’ సినిమాని కిల్ చేయకండి. సినిమాని గౌరవిద్దాం.. ప్రేమిద్దాం. నాకింత క్రేజ్ వచ్చిందంటే సినిమానే కారణం. నా వల్ల ఈ సినిమా ఇబ్బంది పడకూడదు. ఇంతటితో దీనికి ముగింపు పలకండి.
‘లైలా’ను బాయ్‌కాట్ చేయకండి. విశ్వక్‌సేన్‌కు ‘ఫలక్‌నుమాదాస్’కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నా. ఓ వ్యక్తి నాతో నీచంగా మాట్లాడాడు. చనిపోయిన మా అమ్మనూ తిట్టాడు. అది అతడి వ్యక్తిత్వం. నా ఆరోగ్యం దెబ్బతినేలా చేశాడు. అతడి గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలూ వెనక్కి తీసుకుంటున్నా’’ అని అన్నారు.
Comedian Prudhvi, Vishwak Sen
ఇక వీరశంకర్ అడగటంతో ఈ వీడియో చేసినట్లు పృధ్వీ చెప్పారు. అందుతున్న సమాచారం మేరకు లైలా దర్శకుడు రీసెంట్ గా తెలుగు సినిమా డైరక్టర్ అశోశియేషన్ ను అప్రోచ్ అయ్యి, తన బాధ వెళ్ళబోసుకోవటంతో ఈ క్షమాపణ వీడియో బయిటకు వచ్చిందని తెలుస్తోంది.
అందుకే “వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. రాజకీయాలకు సంబంధించి తర్వాత మాట్లాడుదాం. సినిమా వల్లే నాకు పాపులారిటీ, డబ్బు. కాబట్టి సినిమా ఎప్పుడూ బాగుండాలి. లైలా ఆడాలి. అందుకే, నా మాటల వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా సారీ.” అని పృథ్వీ చెప్పారు. “లైలా” సినిమా రేపు (ఫిబ్రవరి 14) విడుదల అయ్యింది.