- Home
- Entertainment
- మొహమాటానికి పోయి నష్టాల పాలు..గోపీచంద్ అలా చేస్తున్నాడని ఇండస్ట్రీలో ఒక్కరికి కూడా తెలియదా..
మొహమాటానికి పోయి నష్టాల పాలు..గోపీచంద్ అలా చేస్తున్నాడని ఇండస్ట్రీలో ఒక్కరికి కూడా తెలియదా..
యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చిత్రాలు యావరేజ్ అవుతున్నాయి. కానీ కెరీర్ బిగినింగ్ లో పడ్డ హిట్స్ మాత్రం దక్కడం లేదు. దీనితో గోపీచంద్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చిత్రాలు యావరేజ్ అవుతున్నాయి. కానీ కెరీర్ బిగినింగ్ లో పడ్డ హిట్స్ మాత్రం దక్కడం లేదు. దీనితో గోపీచంద్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కేవలం రెగ్యులర్ యాక్షన్ చిత్రాలు చేస్తుంటే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు. ఏదో ఒక కొత్తదనం కోరుకుంటున్నారు.
దీనితో గోపీచంద్ కూడా పంథా మార్చారు. తన బలమైన యాక్షన్ ఉంటూనే అందులో సూపర్ నేచురల్ అంశాలు జోడించి భీమా అనే చిత్రంతో రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. మార్చి 8న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ట్రైలర్ లోని అద్భుతమైన విజువల్స్ తో సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఏర్పడింది.
దీనితో గోపీచంద్ కూడా తన వంతు ప్రమోషన్స్ తో సినిమాని జనాల్లోకి తీసుకెళుతున్నాడు. తాజాగా గోపీచంద్ అలీతో సరదాగా సీజన్ 2లో పాల్గొన్నాడు. ఈ షోకి అలీ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో స్టార్స్ ని అలీ గమ్మత్తుగా అడిగే ప్రశ్నలు చాలా సరదాగా ఉంటాయి. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలయింది.
గోపీచంద్ లాంటి కటౌట్ ఉన్న హీరో ఖాకీ డ్రెస్ వేస్తే అవతల వాళ్ళకి వణుకు గ్యారెంటీ అని అలీ ప్రశంసలు కురిపించాడు. ఈ షోలో అలీ.. గోపీచంద్ గురించి ఎవరికీ తెలియని విషయాలు అడిగారు. గోపీచంద్ ని హీరోగా పెట్టి ఒక దర్శకుడు సినిమా చేస్తా అని అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట.. ఎందుకు అంటూ అలీ ప్రశ్నించారు. దానికి సమాధానం తర్వాత చెబుతా అని గోపీచంద్ దాటవేశారు.
కెరీర్ లో మొహమాటాలకు పోయి చాలా నష్టపోయారు కదా అని అలీ ప్రశ్నించారు. నిజమే చాలా నష్టపోయాను. అందుకే జీవితంలో ఇక మొహమాటాలకు తావు ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు గోపీచంద్ పేర్కొన్నారు. అంటే గోపీచంద్ ఏదైనా బిజినెస్ లో నష్టపోయారా లేక సినిమాల విషయంలో వచ్చిన చెత్తకథలన్ని ఒకే చేసి నష్టపోయారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కంప్లీట్ ఎపిసోడ్ లో ఆ క్లారిటీ రానుంది.
ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ గురించి అలీ మరో అద్భుతమైన విషయం బయట పెట్టారు. గోపీచంద్ తన సొంత ఖర్చులతో చాలా మంది పిల్లలని చదివిస్తున్నారట. ఇండస్ట్రీలో కానీ అభిమానుల్లో కానీ ఎవ్వరికి ఆ విషయం తెలియదు. ఎందుకు బయటకి చెప్పుకోవడం లేదు అని అలీ ప్రశ్నించాడు. ఆ పిల్లల్లో కొంతమందికి తన పేరు కూడా తెలియదు అని గోపీచంద్ అన్నారు. అదంతా అక్కర్లేదు. వాళ్ళు బాగా చదువుకోవాలి.. నాకు కావలసింది అంతే అని గోపీచంద్ తన పెద్దమనసు చాటుకున్నాడు.